KGF 2 Record Breaking Baby Movie : కేజీఎఫ్-2 రికార్డును బ్రేక్ చేసిన బేబీ సినిమా.. ఇదేం క్రేజ్ రా బాబు..!
NQ Staff - July 28, 2023 / 11:33 AM IST

KGF 2 Record Breaking Baby Movie :
ఈ నడుమ చిన్న సినిమాలు దుమ్ములేపుతున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయి.. రికార్డు కలెక్షన్లతో సునామీ సృష్టిస్తున్నాయి. ఇలాంటి వాటిలో రీసెంట్ గా వచ్చిన బేబీ మూవీ ఒకటి. ఇది ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. చాలా చిన్న బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. కలెక్షన్ల వరద పారిస్తోంది.
సాయిరాజేశ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించి విమర్షకుల నుంచి ప్రశంసలు పొందారు. అయితే ఇప్పటికే ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన ఈ సినిమా తాజాగా మరో పెద్ద రికార్డును బ్రేక్ చేసింది. ఏకంగా కేజీఎఫ్ రికార్డును పడగొట్టేసింది.
13 రోజుల పాటు..
అప్పట్లో వచ్చిన కేజీఎఫ్-2 ఇండియా వ్యాప్తంగా దుమ్ములేపింది. అయితే ఆ పాన్ ఇండియా సినిమాకు 12 రోజుల పాటు మాత్రమే రూ.కోటి వసూళ్లు వచ్చాయి. కానీ బేబీ సినిమా మాత్రం వరుసగా 13 రోజుల పాటు కోటి రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుని రికార్డ్ సృష్టించింది. దీంతో కేజీఎఫ్-2 రికార్డులు మొత్తం పడిపోయాయి.
ఈ విషయం తెలుసుకుని బేబీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. చూస్తుంటే ఈ సినిమా ఏకంగా రూ.100 కోట్ల కలెక్షన్లను సాధించే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. మరి ముందు ముందు ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు కొల్లగొడుతుందో చూడాలి.