మారటోరియం పై కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ
Admin - August 8, 2020 / 11:56 AM IST

కరోనా కష్టకాలంలో ప్రతిఒక్కరి పరిస్థితి దారుణంగా తయారయ్యింది. అయితే చాలా మందికి బ్యాంక్ లోన్లు, ఈఎంఐ లు ఇతర రుణాల విషయం లో ఆర్బీఐ ఒక నెల గడువు ఇచ్చింది. అయితే తరువాత లోన్ల గడువును మరోసారి మూడు నెలలు పెంచింది. అయితే ఈ ఆగష్టుతో మారటోరియం గడువు పూర్తికానుంది. దీంతో ఆర్బీఐ ఈసారి కార్పొరేటర్లకు, ఇతర వ్యక్తులకు వన్ టైమ్ రుణ పునర్ వ్యవస్థీకరణ బ్యాంకింగ్‌కు అనుమతి ఇచ్చింది.
గత సంవత్సరం జూన్ 7న ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం రుణ పునర్ వ్యవస్థీరణ జరపాల్పి ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఈ మేరకు సూచనలు జారీ చేశారు. ఇక, ఆర్బీఐ రుణ పునర్ వ్యవస్థీకరణకు బ్యాంకింగ్ రంగ నిపుణులు కూడా స్వాగతం పలుకుతున్నాయి. ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్పణం డిమాండ్ పై అనిశ్చితి కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో పాలసీ రేట్లను యథాతథంగా ఉంచాలని ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. మొత్తానికి ఆర్బీఐ మరోసారి మారటోరియం జోలికి పోకుండా రుణాల పునర్ వ్యవస్థీకరణకు అంగీకరించింది.