Kevvu Karthik : ఓ ఇంటివాడు కాబోతున్న కెవ్వు కార్తీక్.. అమ్మాయి ఎవరంటే..?
NQ Staff - June 2, 2023 / 09:29 AM IST

Kevvu Karthik : ఈ నడుమ సెలబ్రిటీలు వరుసగా పెండ్లి పీటలు ఎక్కుతున్నారు. త్వరలోనే వరుణ్ తేజ్ కూడా లావణ్య త్రిపాఠితో ఎంగేజ్ మెంట్ కు రెడీ అవుతున్నాడు. అయితే ఇప్పుడు మరో సెలబ్రిటీ కూడా ఈ లిస్టులోకి చేరిపోయాడు. ఇంతకీ ఆయన ఎవరా అనుకుంటున్నారా జబర్దస్త్ టీమ్ లీడర్ కెవ్వు కార్తీక్.
జబర్దస్త్ ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. ఈ షో కారణంగా చాలామంది కార్లు, ఇండ్లు కొనుక్కుని సెటిల్ అయ్యారు. కార్తీక్ ఇలా సెటిల్ అయిన వాడే. ఆయన మొదట్లో బాగా చదువుకుని మంచి జాబ్ చేసుకునేవాడు. కానీ సినిమాల మీద ఇంట్రెస్ట్ తో ఇండస్ట్రీలోకి వచ్చాడు. జబర్దస్త్ తోనే ఆయన చాలా ఫేమస్ అయ్యాడు.

Kevvu Karthik Is Getting Married Soon
మొదట్లో కంటెస్టెంట్ గా ఉన్న అతను.. ఆ తర్వాత టీమ్ లీడర్ అయ్యాడు. అయితే తాజాగా ఆయన గుడ్ న్యూస్ చెప్పాడు. త్వరలోనే పెండ్లి పీటలు ఎక్కబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఈ మేరకు తనకు కాబోయే భార్యతో దిగిన రెండు ఫొటోలను కూడా పోస్టు చేశాడు.

Kevvu Karthik Is Getting Married Soon
కానీ ఆమె ముఖం కనిపించకుండా ఉన్న ఫొటోలను మాత్రమే పోస్టు చేశాడు. నీతో లైఫ్ ను పంచుకోవడానికి ఈగర్ గా ఎదురు చూస్తున్నా బ్యూటిఫుల్ అంటూ రాసుకొచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు ఆయనకు కంగ్రాట్స్ చెబుతున్నారు. జబర్దస్త్ కంటెస్టెంట్లు కూడా విషెస్ చెబుతన్నారు.