Kerala Young Lady : 20 ఏళ్ల యువతి ప్రాణాలు తీసిన బిర్యానీ
NQ Staff - January 7, 2023 / 07:09 PM IST

Kerala Young Lady : కేరళ కు చెందిన 20 ఏళ్ల యువతి కుజిమంతి అనే రకం బిర్యానీ తిని మృతి చెందిన సంఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనను గురి చేస్తుంది. గత ఏడాది డిసెంబర్ 31 వ తారీఖున ఒక హోటల్ నుండి అంజు శ్రీ పార్వతి బిర్యానీ ఆర్డర్ చేసింది.
బిర్యానీ తిన్నప్పటి నుండి యువతి తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంది. మొదట యువతిని స్థానిక హాస్పిటల్ కి తరలించగా అక్కడ ఆమె ఆరోగ్యం కుదుట పడక పోవడంతో మంగళూరుకు తరలించారు.
అక్కడ ఇన్ని రోజులు చికిత్స పొందుతూ ఇటీవల మృతి చెందింది. మంగళూరులో ప్రముఖ హాస్పిటల్ లో కూడా ఆమె ఆరోగ్యం బాగు పడక పోవడంతో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికే ఆమె తల్లిదండ్రులు బిర్యానీ తినడం వల్లే తమ కూతురు చనిపోయింది అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ స్పందించారు. ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఈ విషయమై విచారించాలని ఆదేశించినట్లుగా పేర్కొన్నారు.
యువతి మృతికి ఫుడ్ పాయిజన్ అని తేలితే కఠిన చర్యలు తప్పవని మంత్రి పేర్కొన్నారు. హోటల్ పై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా మంత్రి హామీ ఇచ్చారు. ప్రస్తుతం మృతురాలి కి సంబంధించిన శవ పరీక్షలు జరుగుతున్నాయని, ఆ తర్వాత పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని స్థానిక మీడియా లో కథనాలు వస్తున్నాయి.