హోమ్ క్వారంటైన్ లో కేరళ ముఖ్యమంత్రి

Advertisement

కరోనా దేశాన్ని పట్టి పీడిస్తుంది. ఇప్పటికే చాలామంది రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డారు. అయితే తాజాగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ హోమ్ ఐసొలేషన్ కి వెళ్లారు. కోజికోడ్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో సహాయక చర్యల్లో పాల్గొన్న 22 మంది అధికారులకు కరోనా సోకింది. దీనితో కేరళ ముఖ్యమంత్రి తో సహా తన క్యాబినెట్ లోని కొంతమంది మంత్రులు ఐసొలేషన్ కి వెళ్లారు. అయితే తిరువనంతపురంలో శనివారం జరగవలిసిన స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో సహకార మంత్రి కదకంపల్లి సురేంద్రన్ జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని కేరళ సిఎం పినరయి విజయన్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here