వెలుగులోకి వస్తున్న కీసర ఎమ్మార్వో ఆస్తులు

Advertisement

హైదరాబాద్ కీసర ఎమ్మార్వో నాగరాజు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిన విషయం తెలిసిందే. అయితే ఓ భూ వివాదం లో పాస్ బుక్ ల కోసం 2 కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ ఆఫర్ చేసారు. దీనితో ఆ డబ్బులు లంఛంగా తీసుకుంటూ ఏఎస్ రావు నగర్ తన నివాసంలో ఏసీబీ కి చిక్కాడు ఎమ్మార్వో నాగరాజు.

అయితే ఏసీబీ అధికారులు నాగరాజు ఆఫీసులో మరియు నివాసం లో సోదాలు నిర్వహించారు. అయితే ఈ సోదాల్లో అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రస్తుతం ఎమ్మార్వో నాగరాజు ఆస్తులు 100 కోట్లకు పైగా ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక ఎమ్మార్వో ఆస్తులు వంద కోట్ల పైగా ఉండడంతో ఏసీబీ అధికారులు ఆశ్చర్యపోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here