Keerthy Suresh : హూప్స్.! మహానటికి పెళ్లియిపోతుందా.? కీర్తి సురేష్ ఇది నిజమేనా.?

NQ Staff - November 28, 2022 / 03:45 PM IST

Keerthy Suresh  : హూప్స్.! మహానటికి పెళ్లియిపోతుందా.? కీర్తి సురేష్ ఇది నిజమేనా.?

Keerthy Suresh  : సెలబ్రిటీల పెళ్లి వార్తలంటే భలే సరదా ప్రేక్షకులకి. ఎక్కడ.? ఎప్పుడు.? ఎలా.? పుడతాయో కానీ, పుట్టిందంటే చాలు పరిమళించేసింది.. అన్న చందంగా ఈ వార్తలు క్షణాల్లో వైరల్ అయిపోతుంటాయ్. కొన్నిసార్లు ఆ గాలి వార్తలే నిజమవుతుంటాయనుకోండి.

తాజాగా మహానటి కీర్తి సురేష్ పెళ్లి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మధ్య కీర్తి సురేష్ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూశారట. ఒక సంబంధం పెద్దవాళ్లకు బాగా నచ్చేసిందట. కీర్తి వద్ద ఆ విషయాన్ని ప్రస్థావించగా అందుకు మహానటి కూడా ఓకే అనేసిందట.

కీర్తి సురేష్ కొత్త అవతార్.. నిజమేనా.!

దాంతో త్వరలోనే కీర్తి సురేష్ పెళ్లి పీటలెక్కబోతోందనే వార్త బయటికి వచ్చేసింది. అసలు ట్విస్ట్ ఏంటంటే, పెళ్లి తర్వాత కీర్తి సురేష్ నటనకు గుడ్ బై చెప్పేయనుందట.. అదీ ఈ వైరల్ న్యూస్ సారాంశం.

అక్కడితో ఆగనే లేదీ వైరల్ సెగ. నటనకు గుడ్ బై చెప్పేసి, నిర్మాతగా రాణించాలనుకుంటోందట కీర్తి సురేష్.. అంటూ తెగ ప్రచారం జరుగుతోంది. చూశారా.? అసలు పెళ్లి వార్తలో నిజమెంతో తెలీదు.. ఏకంగా యాక్టింగ్‌కి గుడ్ బై.. నిర్మాతగా సరికొత్త అవతార్.. అంటూ రకరకాల గాచిప్స్ కీర్తి సురేష్ మీద పుట్టుకొచ్చేస్తున్నాయ్.

టాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరోయిన్‌గా చెలామణీ అవుతోంది కీర్తి సురేష్. అలాగే కోలీవుడ్‌లో కూడా కీర్తి సురేష్ టాప్ హీరోయినే.ఈ మధ్యనే హిందీలోనూ అడుగు పెట్టింది. ఈ తరుణంలో ఈ పెళ్లి పుకార్లేంటో. కీర్తి రెస్పాండ్ అయితే కానీ అసలు విషయం బోధపడదు.!

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us