నిర్మాతగా మారిన కీర్తి సురేష్, మొదటి ప్రాజెక్టు ఇదే

Advertisement

మూవీ ఇండస్ట్రీలో ఎవరు ఇప్పుడు ఏ అవతారం ఎత్తుతారో తెలియదు. ఇప్పటికే ఇండస్ట్రీ చాలామంది హీరోస్, హీరోయిన్స్ దర్శకులుగా నిర్మాతలుగా మారుతున్నారు. అలాగే చాలామంది డైరెక్టర్స్ కూడా నటులు అవుతున్నారు. ఇప్పటికే చాలామంది దర్శకులు నిర్మాతలుగా కూడా మారుతున్నారు. అయితే ఇప్పుడు నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ కూడా నిర్మాతగా మరనున్నారు.

నటిగా ఇప్పుడు కీర్తి సురేష్ తారస్థాయికి చేరుకున్నారు. లీడింగ్ హీరోయిన్స్ లలో ఆమె ఒకరు. అయితే ఇప్పుడు ఆమె ఒక తమిళ వెబ్ సిరీస్ నిర్మానించడానికి సిద్ధమవుతున్నారు. ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. హీరోయిన్ గా సూపర్ హిట్ కొట్టిన కీర్తి సురేష్ నిర్మాతగా కూడా సూపర్ హిట్ అవుతారో లేదో వేచి చూడాలి. కీర్తి సురేష్ నటించిన మిస్ ఇండియా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈమూవీని ఓటీటిలో విడుదల చేయడానికి నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఈ లాక్ డౌన్ సమయంలోనే కీర్తి సురేష్ పెంగ్విన్ చిత్రంతో అమెజాన్ లో రచ్చ చేసింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here