Keerthy Suresh First Earnings Shock Netizens : కీర్తి సురేష్ తొలి సంపాదన రూ.500.. అక్కడ పని చేసిన స్టార్ హీరోయిన్…!
NQ Staff - July 9, 2023 / 09:21 AM IST

Keerthy Suresh First Earnings Shock Netizens :
ఇప్పటి జేనరేషన్ మహానటిగా పేరు తెచ్చుకుంది కీర్తి సురేష్. వరుసగా బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపును సొంతం చేసుకుంది ఈ భామ. ఆమె నటించిన సినిమాలు వరుసగా బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. ఆమె నటనకు చాలామంది అభిమానులు ఉన్నారు. ఎలాంటి పాత్రలో అయినా సరే ఒదిగిపోతుంది ఈ భామ.
అలాంటి కీర్తి సురేష్ కు బ్యాక్ గ్రౌండ్ కూడా బాగానే ఉంది. ఆమె తండ్రి సురేష్ కుమార్ ఓ స్టార్ ప్రొడ్యూసర్. మలయాళంలో ఎన్నో హిట్ సినిమాలను నిర్మించాడు. ఆమె తల్లి మేనక కూడా ఒకప్పుడు స్టార్ యాక్టర్. అందుకే కీర్తి సురేష్ సినీ ఎంట్రీకి పెద్దగా ఇబ్బందులు రాలేదు. కానీ ఆమె నటన, అందం, ట్యాలెంట్ తోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
చైల్డ్ ఆర్టిస్టుగా..
కాగా కీర్తి సురేష్ తొలి సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవుతారు. ఆమె రూ.500 లు సంపాదించిందంట. ఈ విషయాలను ఆమె తండ్రి సురేష్ కుమార్ రీసెంట్ గా వెల్లడించాడరు. ఆయన నిర్మాణంలో వచ్చిన ఓ సినిమాలో కీర్తి సురేష్ చైల్డ్ ఆర్టిస్టుగా పని చేసిందంట. అందుకు గాను ఆమెకు రూ.500 ఇచ్చాడంట సురేష్ కుమార్.
ఆ తర్వాత మరో రెండు సినిమాల్లో కూడా కీర్తి నటించింది. అవి కూడా ఆయన నిర్మాణంలో వచ్చినవే. ప్రస్తుతం కీర్తి సురేష్ ఒక్కో సినిమాకు రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు అందుకుంటూ దూసుకుపోతోంది. ఆమె చేస్తున్న సినిమాలు అన్నీ పాన్ ఇండియా రేంజ్ లోనే రిలీజ్ అవుతున్నాయి.