చిరంజీవి చెల్లెలు పాత్రలో భారీగా రెమ్యూనరేషన్ వసూల్ చేస్తున్న కీర్తి సురేష్.
Admin - October 28, 2020 / 02:21 PM IST

నేను శైలజ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయింది నటి కీర్తి సురేష్. ఇక ఆ సినిమా లో ఆమె నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీనితో తెలుగులో వరుస సినిమా అవకాశాలు లభించాయి. ఇక మహానటి సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది కీర్తి సురేష్. ఇక ఇది ఇలా ఉంటె మెగాస్టార్ చిరంజీవి సినిమాలో చిరంజీవి చెల్లెలు పాత్రలో నటించనుంది. అయితే చిరంజీవి తమిళ సూపర్ హిట్ సినిమా వేదాళమ్ రీమేక్ లో నటించబోతున్న విషయం తెలిసిందే.
ఇక ఈ సినిమాను మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలు పాత్ర కీలకం కానుంది. దీనితో మెగాస్టార్ చెల్లెలు పాత్ర కోసం ముందుగా సాయి పల్లవిని అనుకున్నారట. కానీ సాయి పల్లవి వయసు చిన్నది కావడంతో ఆమె స్థానంలో కీర్తి సురేష్ ను ఫైనల్ చేసారు అని తెలుస్తుంది. ఇక ఇది ఇలా ఉంటె ఈ సినిమా కోసం కీర్తి సురేష్ భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.
అంతేకాదు ఆమె డిమాండ్ కు చిత్ర యూనిట్ కూడా ఒకే చెప్పింది అని తెలుస్తుంది. అయిత్ ఇక ఈ సినిమా షూటింగ్ 2021 జనవరిలో మొదలు కానుందని సమాచారం. ఇక మొత్తానికి స్టార్ హీరో చెల్లెలు పాత్రలో నటించేందుకు సిద్ధం అయింది కీర్తి సురేష్. అయితే ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ సమయంలోనే చిరంజీవి పక్కన నటించబోతుండడంతో చర్చనీయాంశంగా మారింది.