Tarak : తారక్ పర్మిషన్ లేకుండా కీరవాణి ఎక్కడ పాడలేని ఆ పాట ఏంటి..?
Mamatha 600 - February 26, 2021 / 09:00 PM IST

Tarak(తారక్) : సినీ పరిశ్రమలో జూనియర్ ఎన్టీఆర్ ది ప్రత్యేకమైన ఇమేజ్. నందమూరి తారకరామారావు వారసుడిగా తెలుగుతెరకు పరిచయమైన జూనియర్ ఎన్టీఆర్.. అనతికాలంలోనే నందమూరి వంశాన్నినిలబెట్టాడు. తాత, బాబాయి తర్వాత నందమూరి వంశంలో ఆ స్థాయిలో నటనా విశ్వరూపాన్ని చూపించాడు. నందమూరి ఫ్యాన్స్ కి మరో నటుడిని పరిచయం చేశాడు.

keeravani honored mathrudevobhava song to tarak
రాజమౌళి దర్శకత్వంలో నెంబర్ వన్ స్టూడెంట్ చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ తెలుగు తెరకు పరిచయమయ్యాడు. అది సూపర్ హిట్ అయ్యింది. సింహాద్రి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. 5 ఏళ్ల పాటు హిట్ లేకపోయినా మళ్లీ యమదొంగ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత నాన్నకు ప్రేమతో, బృందావనం, జనతాగ్యారేజ్, యమదొంగ ఇలా పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోగా ఎదిగాడు. ఎన్టీఆర్ కు ధీటుగా ఆయన వారసుడిగా నటనను ఫ్రూవ్ చేసుకున్నాడని మెచ్చుకున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ కి బాగా ఇష్టమైన పాట మాతృదేవోభవ సినిమాలోని రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే.. ఆ పాట ఎప్పుడు విన్నా జూనియర్ ఎన్టీఆర్ కి కళ్లలో నీళ్లు వస్తాయట. ఇది తెలుసుకున్న కీరవాణి .. ఎన్టీఆర్ బర్త్ డే గిఫ్ట్ గా ఆ పాటని తనకి అంకితమిచ్చారు. ఎప్పుడైనా సరే పాట పాడాల్సి వస్తే ఎన్టీఆర్ ముందే పాడతానని కీరవాణి చెప్పాడు. ఇప్పటికీ కీరవాణి ఆ పాట పాడుతుంటే ఎన్టీఆర్ ఏడుస్తాడు.
జూనియర్ ఎన్టీఆర్ పరిచయమైన స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రానికి కీరవాణియే మ్యూజిక్ అందించాడు. అంతేకాదు ఆయన నటించిన సింహాద్రి, యమదొంగ, దమ్ము చిత్రాలకు కూడా కీరవాణినే బాణీలు అందించాడు. తెలుగు పరిశ్రమలో జక్కన్నగా పేరు తెచ్చుకున్న రాజమౌళి ప్రతీ చిత్రానికి కీరణవాణి సంగీతం అందిస్తాడు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ట్రిబుల్ ఆర్ చిత్రానికి రాజమౌళినే దర్శకుడు. ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తుంది కూడా కీరవాణినే. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ట్రిబుల్ ఆర్ మూవీ కూడా అంతకుముందు సినిమాల్లాగా ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిద్దాం