KCR : బీఆర్‌ఎస్ మరో భారీ సభ.. ఈసారి ముఖ్య అతిథులు వారే
NQ Staff - January 30, 2023 / 10:00 AM IST

KCR : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఫిబ్రవరి 17వ తారీకున నూతన సచివాలయం ప్రారంభం కాబోతున్న విషయం తెల్సిందే. అదే రోజున బీఆర్‌ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేయబోతుంది. పార్టీ శ్రేణులు భారీ ఎత్తున బహిరంగ సభలో పాల్గొనేలా చేస్తున్నారు.
తమిళ సీఎం స్టాలిన్.. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్.. తేజస్వి యాదవ్ ఇంకా పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్య నాయకులు బీఆర్‌ఎస్ పార్టీ యొక్క బహిరంగ సభలో హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తోంది. సచివాలయం ప్రారంభోత్సవంకు హాజరు కాబోతున్న ముఖ్యమంత్రులు ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు.
ఈ సచివాలయ ప్రారంభోత్సవంకు పక్క రాష్ట్రం ఏపీ ముఖ్యమంత్రిని ఆహ్వానించారా లేదా అనే విషయంలో రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒక వేళ ఆహ్వానం అందితే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారు అనేది కూడా చూడాలి.
దేశ వ్యాప్తంగా బీఆర్‌ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు గాను కేసీఆర్ కృషి చేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే పలు రాష్ట్రాల ప్రాంతీయ పార్టీ నాయకులతో మరియు జాతీయ పార్టీ ముఖ్య నాయకులతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉంటున్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీలను కేసీఆర్ కలుపుకు పోయేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.