KCR : కేటీఆర్ కు పోటీగా దళిత నేత.. కేసీఆర్ ఆలోచన అదేనా..?

NQ Staff - December 5, 2023 / 04:42 PM IST

KCR : కేటీఆర్ కు పోటీగా దళిత నేత.. కేసీఆర్ ఆలోచన అదేనా..?

KCR :

తెలంగాణ ఎన్నికల్లో ప్రజలు అనూహ్యమైన ఫలితాలను ఇచ్చారు. సీఎం కేసీఆర్ ను కాదని కాంగ్రెస్ పార్టీకి జై కొట్టారు. దాంతో ఇప్పుడు బీఆర్ ఎస్ అధినేత ఆలోచనలో పడ్డారు. అసలు ఎక్కడ పొరపాటు జరిగిందనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. వాస్తవానికి బీఆర్ ఎస్ లో పెత్తనం అంతా కల్వకుంట్ల ఫ్యామిలీదే. ఇక్కడ బయట నుంచి వచ్చిన వారిని పెద్దగా పట్టించుకోరనే విమర్శలు ఉన్నాయి. గత పదేండ్లుగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు లేదంటే ఆయన కొడుకు కేటీఆర్, మేనల్లుడు హరీశ్ రావు, బిడ్డ కవిత, కాకుండా సంతోష్ రావులకు మాత్రమే పదవులు దక్కుతున్నాయి.

అంతే.. అంతకు మించి ఎవరికీ ఎన్నడూ పెద్దగా పదవులు దక్కట్లేదనే విమర్శలు బలంగానే ఉన్నాయి. వాస్తవానికి ఈ ఎన్నికల్లో బీఆర్ ఎస్ ఓడిపోవడానికి ఇది కూడా ఒక బలమైన కారణం అనే చెప్పుకోవాలి. దాంతో ఇప్పుడు కేసీఆర్ కూడా ఇదే ఆలోచనలో పడ్డారు. ఈ సారి కల్వకుంట్ల ఫ్యామిలీకి కాకుండా మరొకరికి కీలకమైన స్థానం ఇవ్వాలని అనుకుంటున్నారు. అందుకే ఈ సారి సీఎల్పీ నేత కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచి కాకుండా ఇతరులకు ఇవ్వాలని అనుకుంటున్నారు. దళిత నేత అయితే ఇందుకు బాగుంటుందని అనుకుంటున్నారు. అందుకే కడియం శ్రీహరి పేరును పరిశీలిస్తున్నారంట.

ఆయన అయితే ఎలాంటి విమర్శలు లేని వ్యక్తి కాబట్టి.. మంచి పాజిటివ్ నెస్ ఉంటుందని.. పైగా ఎస్సీలకు సీఎల్పీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి.. తర్వాత ఎన్నికల్లో కూడా ఇది బాగా కలిసి వస్తుందని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. అదే సమయంలో తన కొడుకు భవిష్యత్ గురించి కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ మీద పట్టు జారిపోకుండా ఉండటం కూడా ముఖ్యమే. రేపు వచ్చే ఎన్నికల్లో ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే తన కొడుకును సీఎం చేయాలన్నది కేసీఆర్ ఆలోచన. అందుకే ఇప్పుడు కేటీఆర్ పేరును కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

కడియం శ్రీహరి, కేటీఆర్ లలో ఎవరు అయితే బెటర్ అనే విషయాన్ని కేసీఆర్ ఇప్పుడు ఆలోచిస్తున్నారంట. ఈ ఇద్దరిలో ఎవరు అయితే పార్టీ చీలిపోకుండా ఉంటుంది అనే విషయాన్ని ఆలోచిస్తూ.. రేపు పొద్దున అసెంబ్లీలో ఎవరు అయితే వాయిస్ బలంగా వినిపించి ప్రజల దృష్టిలో హైలెట్ అవుతారనే అంశాలను కూడా ఆలోచిస్తున్నారు.

ఒకవేళ కడియం శ్రీహరికి ఇస్తే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ పర్యటనలు చేసి ప్రజా సమస్యలపై, కాంగ్రెస్ వైఫల్యాలపై పోరాడేలా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఎలాగూ అసెంబ్లీలో కేటీఆర్ బలంగానే మాట్లాడుతారు కాబట్టి.. కేటీఆర్ ను రాష్ట్ర వ్యాప్తంగా హైలెట్ చేయాలన్నది కేసీఆర్ ప్లాన్ అని తెలుస్తోంది.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us