KCR: కరోనా విజృంభ‌ణ‌.. కోవిడ్ ఆంక్ష‌ల గ‌డువును పెంచిన తెలంగాణ ప్ర‌భుత్వం

KCR: క‌రోనా మ‌హ‌మ్మారి బుస‌లు కొడుతుంది. రోజురోజుకు కేసులు పెరుగుతూ పోతున్నాయి. ముఖ్యంగా కోవిడ్ కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కోవిడ్‌ ఆంక్షల గడువును జనవరి 20 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈమేరకు జీవో నెం 6 తీసుకువచ్చింది, తెలంగాణలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.

kcr takes strong decidsion
kcr takes strong decidsion

ఈ నేపథ్యంలో గవర్నమెంట్ కోవిడ్‌ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఆంక్షలు కఠినతరం చేసింది. రాష్ట్రంలో ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్స్‌ నిర్వహించకూడదు. అలాగే ప్రజలు గుంపులుగా చేరకూడదు. బహిరంగ ప్రదేశాల్లో షాపింగ్ మాల్స్, ప్రజా రవాణా , వ్యాపార సంస్థల్లో ప్రతి ఒక్కరు తప్పని సరి మాస్కు ధరించాలి. ఈమేరకు ఆదివారం తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ ప్రభావం భారత్‌లో కనిపిస్తోంది. అనుకున్నదానికంటే శరవేగంగా ఒమిక్రాన్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కరోనా కేసులు భారీగా నమోదువుతున్నాయి. గత 10 రోజుల క్రితం దేశవ్యాప్తంగా 50 వేల లోపు నమోదైన కరోనా కేసులు కేసులు ఇప్పుడు లక్ష 50 వేలకు పైగా నమోదవుతున్నాయి

రోజురోజుకీ పెరుగుతున్న కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా మళ్లీ బడులు తెరుచుకునే పరిస్థితి ఉందా అంటే లేదనే సమాధానం వినిపిస్తోంది. ఈ నెలాఖరులో థర్డ్ వేవ్ పీక్ స్టేజ్ కు వెళ్తుందని హెల్త్ డిపార్ట్ మెంట్ చెబుతుంటే.. స్కూళ్లు ఓపెన్ చేసే పరిస్థితే ఉండదని నిపుణులు చెబుతున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల11 నుంచి బడులకు, 13 నుంచి కాలేజీలకు సంక్రాంతి సెలవులు ఇవ్వాల్సి ఉండగా… 8 నుంచే విద్యాసంస్థలకు సర్కార్ సెలవులు ప్రకటించింది ప్రభుత్వం.

kcr takes strong decidsion
kcr takes strong decidsion

సెలవుల తర్వాత ఫిజికల్ క్లాసులకు సర్కార్ అనుమతిచ్చేది డౌటేనని ఆఫీసర్లే చెబుతున్నారు. దీంతో విద్యాసంవత్సరం వేస్ట్ కాకుండా స్టూడెంట్లకు పాఠాలు చెప్పేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. మళ్లీ ఆన్​లైన్, టీవీ పాఠాలను స్టూడెంట్లకు అందించేందుకు చర్యలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.