BJP Party : సంజయ్ ఉన్నంత కాలమే.. ఇప్పుడు బీజేపీని పట్టించుకోని బీఆర్ ఎస్..!
NQ Staff - November 10, 2023 / 12:33 PM IST

BJP Party :
సమర్థుడైన నాయకుడు ఉంటే ఆ పార్టీకి మైలేజ్ పెరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి వ్యక్తి బీజేపీలో బండి సంజయ్. ఆయన హయాంలో పార్టీ గ్రాఫ్ ఏ రేంజ్ లో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అసలు తెలంగాణలో బీజేపీ ఎక్కడుంది అని సెటైర్లు వేసిన వారికి.. బీజేపీ అంటే ఏంటో రుచిచూపించారు బండి సంజయ్. ఆయన దెబ్బకు కేసీఆర్ కు కూడా కునుకు లేకుండా చేశారు. సంజయ్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. యూత్ లో తిరుగులేని ఫాలోయింగ్ సంజయ్ కు సొంతం అయిపోయింది. అందులో ఎలాంటి అనుమానం లేదు.
సంజయ్ రాకముందు అసలు బీజేపీని పట్టించుకోని బీఆర్ ఎస్.. ఆతర్వాత మాత్రం బండి సంజయ్ ను పదే పదే విమర్శిస్తూ వచ్చింది. ఏ విషయంలో అయినా సరే బీజేపీని టార్గెట్ చేస్తూ వచ్చారు సీఎం కేసీఆర్. ఆయన ఉన్నన్ని రోజులు అసలు కాంగ్రెస్ ను పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే బండి సంజయ్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తీసేశారో.. అప్పటి నుంచే తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ కూడా భారీగా తగ్గిపోయింది. అందులో ఎలాంటి అనుమానాలు లేవు. ఇప్పుడు ఎన్నికల సమయంలో బీజేపీ గురించి మాట్లాడటానికి కూడా కేసీఆర్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు.
అంటే ఆయన దృష్టిలో బీజేపీ అంటే కనీసం ఇంపార్టెన్స్ కూడా లేదన్నమాట. బండి సంజయ్ వైదొలిగినప్పటి నుంచి కిషన్ రెడ్డి పార్టీని అంత బాగా నడిపించట్లేదనే విమర్శలు బాగానే వినిపిస్తున్నాయి. ఆయన హయాంలో రాజకీయాలు చాలా చప్పగా ఉంటున్నాయనే విమర్శలు ఎక్కువగానే వినిపిస్తున్నాయి. ఆయన కేసీఆర్ మీద పెద్దగా విమర్శలు గుప్పించట్లేదు. పసలేని స్పీచ్ లతో సరిపెడుతున్నారంటూ స్వయంగా బీజేపీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ కూడా తన ప్రచార స్పీచ్ లలో కేవలం కాంగ్రెస్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నాడు.

KCR Shows Not Interest In Talking BJP Party
అంతే తప్ప అసలు బీజేపీ ముచ్చటనే తీసుకురావట్లేదు. దాన్ని బట్టి తెలంగాణ ఎన్నికల్లో ఇప్పుడు కాంగ్రెస్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మొన్నటి వరకు కాంగ్రెస్ ను పక్కన పెట్టి కేవలం బీజేపీని టార్గెట్ చేశారు సీఎం కేసీఆర్. కానీ ఇప్పుడు బండి సంజయ్ పక్కకు వెళ్లడంతో ఆయన బీజేపీని లైట్ తీసుకుంటున్నారు.
దాన్ని బట్టి సంజయ్ నేతృత్వంలో బీజేపీ ఎంతగా గ్రాప్ పెంచుకుందో అర్థం చేసుకోవాలి. సంజయ్ లేని లోటు ఇప్పుడు బీజేపీలో స్పష్టంగా కనిపిస్తోంది. యూత్ మొత్తం ఇప్పుడు బీజేపీని పెద్దగా పట్టించుకోవట్లేదు. సంజయ్ హయాంలోనే యూత్ మొత్తం బీజేపీకి అట్రాక్ట్ అయ్యారు. కానీ సంజయ్ వెళ్లిపోయాక యూత్ అసలు పట్టించుకోవట్లేదు.