KCR : ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ అలెర్ట్.. రంగంలోకి కేసీఆర్..?

NQ Staff - January 29, 2024 / 09:54 AM IST

KCR : ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ అలెర్ట్.. రంగంలోకి కేసీఆర్..?

KCR :

బీఆర్ఎస్ ఓడిపోయినప్పటి నుంచి కేసీఆర్ ఇప్పటి వరకు బయటకు రాలేదు. ఆయన ఇంటి వద్దనే ఉంటూ రెస్ట్ తీసుకుంటున్నారు. ఆయన తుంటికి ఆపరేషన్ కావడంతో ఇంకొన్నాళ్ల పాటు ఇంటి వద్దనే రెస్ట్ తీసుకోవాలని అనుకున్నారు. అయితే ఇప్పుడిప్పుడే కోలుకుంటుండటంతో ఆయన తన ఎమ్మెల్యేలకు అందుబాటులోకి వస్తున్నారని తెలుస్తోంది. వాస్తవానికి ఆయన ఇలా ఎమ్మెల్యేలకు అందుబాటులోకి రావడానికి ఓ పెద్ద కారణమే ఉందని తెలుస్తోంది. ఎందుకంటే బీఆర్ ఎస్ ఓడిపోయినప్పటి నుంచి కేటీఆర్, హరీశ్ రావు, కడియం శ్రీహరి కొన్ని కామెంట్లు చేస్తున్నారు.

కాంగ్రెస్ బొటా బొటి మెజార్టీతో గెలిచిందని.. త్వరలోనే ఆ ప్రభుత్వం కూలిపోతుందని సంచలన కామెంట్లు చేశారు. దాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా సీరియస్ గానే తీసుకున్నట్టు తెలుస్తోంది. అందుకే ఇప్పుడు వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కోవాలని చూస్తుంది. మొన్నా మధ్య కోమటిరెడ్డి వెంటక్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేలు ఉండరని బాంబు పేల్చారు. దానికి తగ్గట్టే వరుసగా సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ అవుతున్నారు. మొన్న నలుగురు ఎమ్మెల్యేలు భేటీ అయిన సంగతి తెలిసిందే.

ఇక తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కూడా రేవంత్ రెడ్డితో భేటీ అయ్యాడు. ఇవన్నీ చూస్తుంటే కచ్చితంగా వారిని కాంగ్రెస్ లోకి రేవంత్ ఆహ్వానించి ఉంటారని తెలుస్తోంది. ఇది గమనించిన కేసీఆర్ కచ్చితంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాపాడుకోవాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ తన పార్టీలోకి లాక్కున్నారు. ఇప్పుడు అదే గేమ్ ను కాంగ్రెస్ ప్లాన్ చేయదనే గ్యారెంటీ లేదు. కాబట్టి తన ఎమ్మెల్యేలకు పార్టీ తరఫున హామీలు ఇవ్వాలని కేసీఆర్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. తన అపాయింట్ మెంట్ గతంలో కేసీఆర్ ఇవ్వలేకపోయారు.

కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యేలకు కావాల్సినంత సమయం తన ఇంటి వద్దనే ఇవ్వాలని అనుకుంటున్నారంట. వారితో అన్ని విషయాలపై మాట్లాడి వారిని పార్టీ లైన్ దాటకుండా చూసుకోవాలని కేసీఆర్ అనుకుంటున్నారు. ఇందుకోసం ఏ ఎమ్మెల్యే ఎప్పుడైనా వచ్చి కలవొచ్చని సంకేతాలు ఇవ్వబోతున్నారంట.

ఎమ్మెల్యేల కోసం ప్రత్యేకంగా సమయం కేటాయిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా కేసీఆర్ తన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు పెద్ద ప్లానే వేస్తున్నారు. కాబట్టి ఇది కేసీఆర్ కు బాగానే కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ఎమ్మెల్యేలను కంట్రోల్ లో ఉంచుకుంటే కచ్చితంగా అది బీఆర్ ఎస్ కు లాభం చేకూర్చే పనే అని అంటున్నారు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us