KCR : కేసీఆర్ స‌ర్కార్ స‌రికొత్త నిర్ణ‌యం.. థియేట‌ర్స్‌లోను పార్కింగ్ ఫీజు చెల్లించాల్సందే..!

KCR : ఇప్ప‌టికే సినీ ప్రేక్ష‌కులకు షాకుల మీద షాకులు త‌గులుతున్నాయి. ఈ క్ర‌మంలో మ‌రో పెద్ద షాక్ ఇవ్వ‌బోతుంది తెలంగాణ స‌ర్కార్. గతంలో సినిమా థియేటర్లలో పార్కింగ్ ఫీజులను నియంత్రిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో నెం. 63ని జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ జీవో ప్రకారం సినిమా థియేటర్లు, మాల్స్‌తో పాటు మల్టీప్లెక్సుల్లో పార్కింగ్‌ ఫీజులను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

kcr government ok to theater parking fee 1
kcr government ok to theater parking fee 1

ఇది చాలా రోజుల పాటు కొనసాగింది. అయితే థియేటర్ల యాజమాన్యాల అభ్యర్థన మేరకు తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో సినిమా థియేటర్లలో పార్కింగ్ రుసుంలను వసూలు చేసుకోవడానికి అనుమతినిచ్చింది. ఈ విషయమై పార్కింగ్‌ ఫీజులను నియంత్రిస్తూ తీసుకొచ్చి జీవో నెం. 63కు సవరణలు చేసింది.

kcr government ok to theater parking fee
kcr government ok to theater parking fee

థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు, మాల్స్‌కి వెళ్లినప్పుడు పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారంటూ ఇటీవల ఫిర్యాదులు వెల్లువెత్తడంపై కేసీఆర్ సర్కార్ స్పందించింది. పార్కింగ్ ఫీజుకి సంబంధించి షాకింగ్ డెసిషన్ తీసుకుంది. థియేటర్లలో వాహనాల పార్కింగ్‌కి డబ్బులు చెల్లించాలని పేర్కొంది.

అయితే అది కేవలం ఒక్క తెర ఉండే థియేటర్లకు మాత్రమే వర్తించనుంది. కేవలం సింగిల్ స్క్రీన్ ఉన్న థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. మల్టీప్లెక్స్‌లలో మాత్రం ఫ్రీ పార్కింగ్ ఉంటుందని.. ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. అందుకు సంబంధించిన జీవో 63ను తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది.

థియేటర్లలోని పార్కింగ్‌ ప్రదేశాల్లో సినిమాకు వచ్చిన వారే కాకుండా ఇతర పనుల కోసం వచ్చిన వారు వారు కూడా పార్కింగ్‌ చేస్తున్నారని.. దీంతో వాహనాల పార్కింగ్‌, భద్రత విషయం సవాల్‌గా మారిందని ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. విజ్ఞప్తిని పరిశీలించిన ప్రభుత్వం పార్కింగ్‌ ఫీజు వసూలు చేసుకునేందుకు అమతిచింది