KCR : కామారెడ్డిలో కేసీఆర్ ఓటమి ఖాయమేనా.. మరీ మూడో స్థానమా..?

NQ Staff - December 3, 2023 / 11:11 AM IST

KCR : కామారెడ్డిలో కేసీఆర్ ఓటమి ఖాయమేనా.. మరీ మూడో స్థానమా..?

KCR :

సీఎం కేసీఆర్ కు కామారెడ్దిలో భారీ షాక్ తగిలింది. బీఆర్ ఎస్ కు కంచుకోటగా ఉండే కామారెడ్దిలో ఈజీగా గెలుస్తామని కేసీఆర్ భావించారు. గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో పోటీ చేసి ఆయన గెలుపొందాలని అనుకున్నారు. కానీ ఆయనకు కామారెడ్డిలో దిమ్మ తిరిగే షాక్ తగిలింది. గెలవడం సంగతి పక్కన పెడితే.. కనీసం పోటీ ఇవ్వలేకపోతున్నారు.

ఇప్పటి వరకు ఐదు రౌండ్లు ముగిసేసరికి కేసీఆర్ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. అక్కడ రేవంత్ రెడ్డి మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. రెండో స్థానంలో విజయరమణారెడ్డి ఉన్నారు. బీజేపీ కంటే కేసీఆర్ కు తక్కువ ఓట్లు రావడం అనేది పెద్ద షాక్ అనే చెప్పుకోవాలి.

ఎందుకంటే సీఎం అభ్యర్థిగా ముందే డిక్లేర్ అయిన కేసీఆర్ ను కామారెడ్డి ఓటర్లు మరీ ఇంత దారుణంగా ఓడించడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పటి వరకు కేసీఆర్ కు కేవలం 3524 ఓట్లు మాత్రమే వచ్చాయి. రేవంత్ రెడ్డికి ఏకంగా 8754ఓట్లు వచ్చాయి. దీన్ని బట్టి కేసీఆర్ కు ఇది కోలుకోలేని దెబ్బ అని చెప్పుకోవచ్చు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us