KCR : కేసీఆర్ సరికొత్త ప్లాన్.. రెండు కీలక ప్రకటనలు చేసే అవకాశం..?

NQ Staff - November 26, 2023 / 09:30 AM IST

KCR : కేసీఆర్ సరికొత్త ప్లాన్.. రెండు కీలక ప్రకటనలు చేసే అవకాశం..?

KCR :

ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ ఒక్కొక్క అస్త్రాన్ని బయటకు తీస్తున్నాయి అన్ని పార్టీలు. ఒక పార్టీ ప్రకటించిన కొద్ది గంటలకే మరో పార్టీ కీలకమైన ప్రకటనలు చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కేసీఆర్ కూడా కొన్ని కీలకమైన ప్రకటనలు చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి కేసీఆర్ పదేండ్ల పాలనలో అన్ని వర్గాలను టచ్ చేశారు. ప్రతి వర్గానికి ఏదో ఒక స్కీమ్ ను ప్రకటించి ఆకట్టుకునేలా ప్రయత్నాలు అయితే చేశారు. అందుకే ఈ ఎన్నికల సమయంలో కూడా ఆ వర్గాలను ఆకట్టుకునే విధంగా కొన్ని కీలక మైన ప్రకటనలు చేశారు.

కానీ ఇంకా అనుకున్న స్థాయిలో క్రేజ్ రావట్లేదనే వెలితి కేసీఆర్ మదిలో ఉంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. అందుకే ఆయన ఈ సారి మరో కీలకమైన ప్రకటన చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆటో వాహనాల కోసం కీలకమైన ప్రకటన చేశారు. వాహనాల ఫిట్ నెస్ చార్జీలను మాపీ చేస్తామని హామీ ఇచ్చారు. దాంతో పాటు కొత్తగా ఇల్లు కొనేవారి కోసం కూడా కొత్త స్కీమ్ తీసుకువస్తామని తెలిపారు. కాగా దాంతో పాటు మరో రెండు కీలకమైన ప్రకటనలపై కూడా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దాన్ని గనక ప్రకటిస్తే తిరుగు ఉండదేమో అని భావిస్తున్నారు.

ఇన్ని రోజులు ప్రతిపక్షాలు ఏమేం ప్రకటనలు చేస్తాయో అని ఎదురు చూశారు. ఇక వారి ప్రకనటలు అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఈ ప్రకటనలను ముందు ఉంచాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా మొన్న హైదరాబాద్ లో భారీ సభ పెట్టాలని అనుకున్నారు. కానీ వర్షాభావ పరిస్థితులు ఉండటంతో ఆ సభలను రద్దు చేసుకున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని ప్రజా ఆశీర్వాద సభలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ సభల్లో ఈ ప్రకటనలు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారంట. ఇందుకోసం నియోజకవర్గాల్లో పరిస్థితులుపై గులాబీ బాస్ ఎప్పటికప్పులు ఆరాలు తీస్తున్నారు.

అక్కడ వస్తున్న వ్యతిరేకతను బట్టి ఈ ప్రకటనలు చేయాలా వద్దా అనేది ఆలోచిస్తున్నారంట. ఇప్పటికే చాలా నియోజకవర్గాల నుంచి ఆ ప్రకటనలు చేస్తేనే బాగుంటుంది అని రిజల్ట్ రావడంతో కేసీఆర్ కూడా ఈ ప్రకటనలు చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఆ ప్రకనటలు గ్రామీణ ఓటర్లతో పాటు యువతను ఆకర్షించే విధంగా ఉంటాయని సమాచారం.

తెలంగాణలో గ్రామీణ ఓటర్లదే కీలక పాత్ర. పైగా యువకులు అతి ముఖ్యం. అందుకే ఈ రెండు వర్గాలను ఆకట్టుకునే విధంగా రెండు కీలకమైన ప్రకటనలు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారంట. దాంతో పాటు మధ్య తరగతి వారు ఇల్లు కట్టుకుంటే వచ్చే వడ్డీ మీద కూడా కీలకమైన ప్రకటన ఉంటుందని సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us