కరోనా టెస్ట్ ల మీద సంచలన నిర్ణయం తీసుకున్న కేసీఆర్

Advertisement

హైదరాబాద్: కరోనా రాష్ట్రంలో రోజురోజుకు విజృంభిస్తుంది. బుధవారం ఒక్క రోజే 2,092 కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 73 వేలకు పైగా కేసులు నమోదుగా, వారిలో 52,103 మంది కొలుకోగా, 589 మంది మృతి చెందారు. కరోనా విజృంభిస్తున్న కేసీఆర్ పట్టించుకోవడం లేదని, అసలు రాష్ట్రంలో టెస్టుల జరగడం లేదని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో వాటికి సమాధానం ఇవ్వడానికి కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకున్నారు.

రోజుకు రాష్ట్రంలో 40,000 టెస్టులు జరగాలని వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే 10 లక్షల హోమ్ ఐసోలాషన్ కిట్స్ కూడా సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజలందరికీ కరోనాపై అవగాహన కలిపించి, తగు జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని వెల్లడించారు. ఇన్ని రోజులు టెస్టులు చేయడం లేదని ప్రభుత్వం మీద వస్తున్న ఆరోపణలను ఈ నిర్ణయంతో సమాధానం ఇచ్చారు. కరోనా చికిత్స విషయంలో అక్రమంగా వ్యవహరించిన హాస్పిటల్స్ పై కూడా చర్యలు తీసుకొని, హాస్పిటల్స్ యొక్క అరాచకాలకు అడ్డుకట్ట వేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here