KCR : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్: లిక్కర్ స్కామ్లో కవితను కాపాడేందుకు వైసీపీతో కేసీయార్ కుట్ర.!
NQ Staff - December 8, 2022 / 08:33 PM IST

KCR : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దిశగా తమ పార్టీ ప్రయత్నిస్తుందంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ సహా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన తెలంగాణ నేతలు ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై స్పందించారు, స్పందిస్తూనే వున్నారు.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు, తెలంగాణలో అలజడి సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందంటూ తెలంగాణ నాయకులు మండిపడుతున్నారు.
కవితను కాపాడేందుకు కేసీయార్ కుట్ర..
‘ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి డ్రామాలు ఆడుతున్నారు.. కవిత లిక్కర్ స్కామ్ విషయాన్ని డైవర్ట్ చేసేందుకు వైసీపీ నాయకులతో కలిసి కేసీయార్ కుట్ర చేస్తున్నారు..’ అంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.
కమిషన్ల ఒప్పందంతో స్కాముల విషయం పక్కు పోయేందుకే ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయిస్తున్నారన్నది బండి సంజయ్ ఆరోపణగా కనిపిస్తోంది.
తెలంగాణ కాంగ్రెస్ నేత మల్లు భట్టివిక్రమార్క, కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ తదితరులు ఇప్పటికే సజ్జల వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు.