Kavya Kalyanram : రెమ్యునరేషన్ ఎక్కువ ఇస్తే లిప్ లాక్ సీన్లకు రెడీ.. బలగం హీరోయిన్ కామెంట్లు..!

NQ Staff - June 5, 2023 / 09:50 AM IST

Kavya Kalyanram : రెమ్యునరేషన్ ఎక్కువ ఇస్తే లిప్ లాక్ సీన్లకు రెడీ.. బలగం హీరోయిన్ కామెంట్లు..!

Kavya Kalyanram : చిన్న సినిమాలు కూడా ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతున్నాయి. పెట్టిన దానికంటే మూడింతలు వసూలు చేసి పెద్ద సినిమాలకు షాక్ ఇస్తున్నాయి. ఇలాంటి వాటిలో ముందుగా చెప్పుకోవాల్సింది మాత్రం బలగం సినిమా గురించే. కమెడియన్ వేణు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంచలన విజయం నమోదు చేసింది.

ఇందులోని ప్రతి పాత్ర ప్రేక్షకులకు గుర్తిండిపోయేలా ఉంది. ఈ సినిమాతోనే హీరోయిన్ గా పరిచయం అయింది కావ్య కల్యాణ్‌ రామ్. ఆమె గతంలో చైల్డ్ ఆర్టిస్టుగా చాలా సినిమాలు చేసింది. గంగోత్రి సినిమాలో హీరోయిన్ చిన్నప్పటి పాత్ర చేసింది. ఆ తర్వాత కూడా చాలా సినిమాలు చేసింది. కానీ ఇప్పుడు పెద్దయ్యాక హీరోయిన్ గా మారిపోయింది.

బలగం తర్వాత కూడా ఆమెకు బాగానే ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఆమె మాట్లాడుతూ.. బోల్డ్ సీన్లపై మాట్లాడింది. ఒక నటిగా నిరూపించుకోవాలంటే అన్ని సీన్లలో నటించాల్సి ఉంటుంది. అప్పుడే మనం సంపూర్ణ నటిగా గుర్తింపు పొందుతాం.

కాకపోతే అలాంటి సీన్లు చేయడానికి ఇప్పుడు అందరూ కాస్త ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. మంచి కథ వస్తే అలాంటి సీన్లు చేయడానికి నాకు అభ్యంతరం లేదు. కాకపోతే అలాంటి సీన్లకు కాస్త డిమాండ్ చేయాల్సి వస్తుంది అంటూ ఓపెన్ గా చెప్పేసింది. అంటే తనకు డబ్బులు ఎక్కువ ఇస్తే ఎలాంటి సీన్లు చేయడానికి అయినా రెడీ అని చెప్పేసిందన్నమాట.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us