KAUSHAL: కౌశ‌ల్‌కు కరోనా భ‌యం.. ఎందుకు టెస్ట్ చేయించుకున్నాడంటే..!

KAUSHAL ప్ర‌స్తుతం అంత‌టా క‌రోనా ఛాయ‌లు అమ్ముకున్నాయి. ఎవ‌రి నోట విన్నా ,ఏ మీడియాలో చూసిన కూడా కరోనా గురించే. అంద‌రి గుండెల్లో గుబులు పుట్టిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారి కోర‌లు చాస్తుంది.సామాన్యులు, సెల‌బ్రిటీలు అనే తేడా లేకుండా అంద‌రిని భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తుంది. క‌రోనా వ‌ల‌న సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి, థియేట‌ర్స్ మూత‌ప‌డ్డాయి. కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ ప్ర‌క‌టించాయి. రోజుకు మూడున్న‌ర ల‌క్ష‌ల కేసులు న‌మోదు అవుతుండ‌డం, వేల కొల‌ది మ‌ర‌ణాలు సంభ‌విస్తుండ‌డంతో అంద‌రి గుండెల్లో గుబులు మొద‌లైంది.

దాదాపు చిత్ర షూటింగ్స్ అన్నీ క‌రోనా వ‌ల‌న వాయిదా ప‌డ్డాయి. కొంద‌రు మాత్రం అన్ని జాగ్ర‌త్త‌లు పాటిస్తూ సెట్‌లో 50 మందికి మించ‌కుండా షూటింగ్ నిర్వ‌హిస్తున్నారు. ఇలా చేస్తున్న‌ప్ప‌టికీ క‌రోనా బారిన ప‌డుతున్నారు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇలానే క‌రోనా బారిన ప‌డ‌గా, ప్ర‌స్తుతం ప్ర‌భాస్, రామ్ చ‌ర‌ణ్‌, మ‌హేష్ బాబు ఐసోలేష‌న్‌లో ఉన్నారు. అయితే బిగ్ బాస్ సీజ‌న్ 2 విన్న‌ర్ కౌశ‌ల్‌కు సైతం క‌రోనా భ‌యం ప‌ట్టుకుంది. దీంతో అత‌ను వెంట‌నే క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకొని అందుకు సంబంధించిన వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు.

కౌశ‌ల్ ఎప్పుడు ఫ్యాష‌న్ డిజైనింగ్, మోడ‌లింగ్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. అతని చుట్టు ప‌క్క‌ల రోజు కొన్ని వంద‌ల మంది ఉంటుంటారు. అయితే రీసెంట్‌గా అత‌ని ద‌గ్గ‌ర ప‌ని చేసే డిజైన‌ర్‌కు క‌రోనా సోకింద‌ట‌. దీంతో అత‌డు క‌రోనా ప‌రీక్ష చేయించుకున్నాడ‌ట‌. త‌ర‌చు పిల్ల‌ల‌ను, భార్య క‌లుస్తుండ‌డం వ‌ల‌న కౌశ‌ల్ నుండి వారి ఫ్యామిలీకి ఎక్క‌డ క‌రోనా సోకుతుందేమోన‌ని భావించి ప‌రీక్ష చేయించుకున్నాడ‌ట‌. ముందు జాగ్రత్త పడటం మంచిదే అని సూచించాడు. కాగా ప్రస్తుతం కౌశల్ బ్లాక్ అనే సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా అతి త్వ‌ర‌లో విడుద‌ల కానుంది.

Advertisement