Kaushal: అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న కౌశ‌ల్ భార్య‌.. వైర‌ల్ అవుతున్న బిగ్ బాస్ విన్న‌ర్ పోస్ట్

బుల్లితెర కార్య‌క్ర‌మం బిగ్ బాస్ అన్ని ప్రాంతీయ భాష‌ల‌లో జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తెలుగులోను ఈ కార్య‌క్ర‌మానికి మంచి టీఆర్పీ వ‌స్తుండ‌డంతో నిర్మాత‌లు వ‌రుస సీజ‌న్స్ చేస్తున్నారు. ఇప్ప‌టికే నాలుగు సీజ‌న్స్ పూర్తి చేసుకున్న ఈ షో త్వ‌ర‌లో ఐదో సీజ‌న్ జ‌రుపుకోనుంది. క‌రోనా సెకండ్ వేవ్ ఉదృతి వ‌ల‌న ఈ షో ప్ర‌సారానికి మ‌రింత టైం ప‌ట్టే ఛాన్స్ ఉంది. అయితే సెకండ్ సీజ‌న్ విన్న‌ర్‌గా కౌశ‌ల్ మండా నిల‌వ‌గా ఆయ‌న బిగ్ బాస్ షోతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నాడు. కౌశ‌ల్‌కు కౌశ‌ల్ ఆర్మీ పేరుతో ప్ర‌త్యేక గ్రూప్ కూడా ఏర్పాటైంది. ఈ ఆర్మీతో కౌశ‌ల్ మంచి సేవా కార్య‌క్ర‌మాలు కూడా చేస్తున్నారు.

కౌశ‌ల్ ఎన్నో క‌ష్ట న‌ష్టాల మ‌ధ్య ఈ స్థాయికి చేరుకున్నాడు. బిగ్ బాస్ లో ఉన్న స‌మ‌యంలోను కౌశ‌ల్ అనేక మాట‌లు ప‌డ్డాడు. సోలోగా గేమ్ ఆడి టైటిల్‌ని ముద్దాడాడు. ఇప్పుడు జీవితంలోను కౌశ‌ల్‌కి అనేక స‌మ‌స్య‌లు ఉత్ప‌న్నం అయ్యాయి. కౌశ‌ల్ భార్య అనారోగ్యంతో బాధ‌ప‌డుతుంద‌ని ఓ సంద‌ర్భంలో పేర్కొన్నాడు కౌశ‌ల్.తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షాకింగ్ పోస్ట్ పెట్టి అందరిని షాక్‌కు గురి చేశాడు కౌశ‌ల్. ఏదో సాధించేందుకు బయల్దేరావు.. ఏదో ఒకటి చేసేందుకు నువ్ నీ జీవితంతో పోరాడుతున్నావ్.. నీకున్న ధైర్యంతో అది నువ్ సాధిస్తావ్ అని నాకు తెలుసు.. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.. నువ్వు కన్న కలల కోసం పోరాడిరా.. లవ్యూ.. మిస్ యూ’ అంటూ కౌశల్ భార్యతో కలిసి ఉన్న వీడియోని పోస్ట్‌ చేశాడు.

కౌశ‌ల్ పోస్ట్‌తో ఆయ‌న అభిమానులు ఆవేద‌న చెందుతున్నారు. వదిన‌కు ఏమైంద‌న్నాఅంటూ కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. కౌశ‌ల్ ప్ర‌స్తుతం బుల్లితెరపై ప‌లు షోస్ చేస్తూ ఈవెంట్ మేనేజ‌ర్‌గా ప‌లు కార్య‌క్ర‌మాలు చేస్తున్నాడు. ప్ర‌స్తుతం కౌశ‌ల్ త‌న బిజినెస్ ప‌నుల వ‌ల‌న వేరే దేశానికి వెళ్లినట్టు తెలుస్తుంది. త్వ‌ర‌లోనే ఇండియాకి తిరిగి రానున్నాడ‌ని , ఆయ‌న భార్య అనారోగ్యంతో బాధ‌ప‌డుతుండ‌డం కౌశ‌ల్‌ని ఇబ్బందికి గురి చేస్తుంద‌ని అంటున్నారు. ఏదేమైన కౌశ‌ల్ భార్య కోలుకోవాల‌ని మ‌నంద‌రం కూడా కోరుకుందాం.