Kashmira Shah Shocking Comments On Salman Khan : సల్మాన్ ఖాన్ వల్ల తల్లినయ్యా.. బాలీవుడ్ నటి సంచలన కామెంట్స్..!
NQ Staff - July 12, 2023 / 09:59 AM IST

Kashmira Shah Shocking Comments On Salman Khan :
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆయన సినిమాలకు ఇండియాలోనే అత్యధిక కలెక్షన్లు వస్తుంటాయి. అంత పెద్ద హీరో అయి ఉండి ఇంకా పెళ్లి చేసుకోలేదు. యాభై ఏళ్లు దాటుతున్నా సరే సింగిల్ గానే ఉండిపోయాడు ఈ అందగాడు. కానీ ఆయనకు హీరోయిన్లలో ఇంకా ఫుల్ ఫాలోయింగ్ ఉంది.
గతంలో ఆయన చాలామంది హీరోయిన్లతో డేటింగ్ చేశాడు. కానీ ఒక్కరిని కూడా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉండిపోయాడు. ఇప్పటికీ ఆయన మీద ఏదో ఒక రూమర్ వస్తనే ఉంటుంది. మరి ఆయన ఫిజిక్ కూడా అలాగే ఉంటుందనుకోండి. అయితే ఇప్పుడు ఓ బాలీవుడ్ నటి చేసిన కామెంట్లు పెద్ద దుమారమే రేపుతున్నాయి.
రెండో భర్తతో కలిసి..
ఆమె ఎవరో కాదు నటి కాష్మీర షా. ఆమె గతంలో చాలా సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. అంతే కాకుండా అటు టెలివిజన్ రంగంలో కూడా బాగానే రాణిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. నేను రెండో భర్తతో పిల్లల్ని కనాలని ఎంతో ప్రయత్నించాను. కానీ సక్సెస్ కాలేదు.

Kashmira Shah Shocking Comments On Salman Khan
చివరకు ఐవీఎఫ్ ద్వారా తల్లి అయ్యేందుకు ప్రయత్నం చేశాను. కానీ ఫలించలేదు. ఆ సమయంలోనే సరోగసి ద్వారా పిల్లల్ని కనాలంటూ సల్మాన్ ఖాన్ సలహా ఇచ్చారు. ఆయన చెప్పినట్టే సరోగసి ద్వారా ఇద్దరు పిల్లల్ని కన్నాను. ఏదేమైనా ఇప్పుడు మా ఇంట్లో పిల్లల సందడి ఉందంటే మాత్రం దానికి కారణం సల్మాన్ ఖాన్ ఇచ్చిన సలహానే అంటూ ఎమోషనల్ అయింది ఈ భామ.