TRS : కేసీఆర్ మరో ప్లాన్.. ఈటలను తప్పించినందుకు మరో ముదిరాజ్ నేతకు పార్టీలోకి ఆహ్వానం?

TRS : ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ చూసినా ఈటల రాజేందర్ గురించే చర్చ. ఉన్నట్టుండి.. ఒక్కసారి ఈటల రాజేందర్ పై సీఎం కేసీఆర్ ఉక్కుపాదం మోపారు. ఆయనపై భూకబ్జా వ్యవహారంలో విచారణకు ఆదేశాలు జారీ చేయడం మొదలు.. ఆయన గురించి మీడియాలో కథనాలు ప్రసారం కావడం, ఆ తెల్లారే ఆయన మంత్రిత్వ శాఖను సీఎం కేసీఆర్ బదలాయించుకోవడం, ఆ తర్వాత ఈటలను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం.. అన్నీ చకచకా జరిగిపోయాయి. పక్కా ప్లాన్ ప్రకారం.. ఈటల రాజేందర్ పై వ్యూహాలు అమలు అయ్యాయి అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏది ఏమైనా.. దశాబ్దాల పాటు పార్టీకి నమ్మకంగా పనిచేసి.. సీఎం కేసీఆర్ అత్యంత ఆప్తుడిగా ఉన్న ఈటల రాజేందర్ చాప్టర్ టీఆర్ఎస్ లో క్లోజ్ అయిపోయింది.

kasani gnaneshwar to join in trs
kasani gnaneshwar to join in trs

ఈటల రాజేందర్ ను ఉన్నపళంగా మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం వల్ల టీఆర్ఎస్ పార్టీకి ఎంతో కొంత నష్టం మాత్రం జరుగుతుంది. ఆ నష్టాన్ని ఎలా పూడ్చాలి.. అనే దానిపై ప్రస్తుతం సీఎం కేసీఆర్ మల్లగుల్లాలు పడుతున్నారట. ఈటలది బీసీ సామాజికవర్గం ముదిరాజ్. తెలంగాణలో ముదిరాజ్ సామాజిక వర్గం ప్రజలు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఈటలను బర్తరఫ్ చేయడం వల్ల.. పార్టీకి ముదిరాజ్ ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే  ప్రమాదం ఉందని గ్రహించిన సీఎం కేసీఆర్ వెంటనే దిద్దుబాటు చర్యలను ప్రారంభించారట.

నిజానికి.. ఈటల రాజేందర్ ను బీసీ నేతగా, ముదిరాజ్ నేతగా ప్రొజెక్ట్ చేసిందే సీఎం కేసీఆర్. దాని వల్ల.. అప్పట్లో ముదిరాజ్ సంఘంలో కీలకంగా ఉన్న కాసాని జ్ఞానేశ్వ‌ర్ ను పక్కను నెట్టేలా చేశారు. ఈటల ప్రాబల్యం పెరుగుతూ రావడంతో.. కాసాని గుర్తింపు తగ్గుతూ వచ్చింది. కానీ.. ఇప్పుడు ఈటల టీఆర్ఎస్ కు దూరం కావడంతో.. ముదిరాజ్ ఓటు బ్యాంకును అలాగే ఉంచుకోవడం కోసం కేసీఆర్.. కాసానికి బంపర్ ఆఫర్ ఇచ్చారట. పార్టీలో చేరాలంటూ ఆహ్వానం పంపారట. దీని వల్ల.. తమ పార్టీ బీసీలకు కానీ.. ముదిరాజ్ లకు కానీ వ్యతిరేకం కాదని చెప్పడంతో పాటు.. కేవలం ఈటలను తప్పించింది.. పార్టీ వ్యవహారాల వల్ల తప్పితే.. దీంట్లో సామాజిక వర్గం కోణం లేదు అని చెప్పడం కోసం సీఎం కేసీఆర్ కాసానిని దగ్గర తీస్తున్నట్టు తెలుస్తోంది. మరి.. కాసాని జ్ఞానేశ్వ‌ర్ .. సీఎం కేసీఆర్ ఆహ్వానాన్ని కాదంటారా? లేక పార్టీలో చేరుతారా? అనేది తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.