Karthik Patri : అర్థరాత్రి రోడ్డుపై నడిచి వెళితే.. వెయ్యి రూపాయల ఫైన్.!
NQ Staff - December 11, 2022 / 09:38 PM IST

Karthik Patri : మద్యం సేవించి వాహనాలు నడపకూడదు.. అతి వేగంగా వాహనాలు నడపకూడదు.. హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాల్ని నడిపితే తప్పు.! వీటికి జరీమానాలున్నాయ్.
కానీ, అర్థరాత్రి రోడ్డుపైన నడుచుకుంటూ వెళితే కూడా జరీమానా విధిస్తారా.? ఔను, బెంగళూరులో అర్థరాత్రి ఓ జంట (భార్యాభర్యతలే) నడిచి వెళ్ళినందుకు వెయ్యి రూపాయల జరీమానా చెల్లించారు. పోలీసులైతే మూడు వేల రూపాయలు జరీమానా చెల్లించాలంటూ అల్టిమేటం జారీ చేశారు. కానీ, చివరకు వెయ్యి రూపాయల జరీమానాతో వ్యవహారం సెటిల్ అయ్యింది.
బెంగళూరు సిటీ పోలీస్ గుస్సా..
పెట్రోలింగ్‌లో వున్న పోలీస్ సిబ్బంది చూపిన అత్యుత్సాహం, కర్కశత్వం కారణంగానే ఇదంతా జరిగింది. ఓ బర్త్‌డే పార్టీ ముగించుకుని.. తన భార్యతో కలిసి కార్తీక్ పత్రీ అనే వ్యక్తి రోడ్డు మీద నడచుకుంటూ వెళ్ళాడు. అదే ఆ జంట చేసిన పెద్ద తప్పు.
తాను చేసిన తప్పుకి చింతిస్తూ కార్తీక్ పత్రీ, ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో, ఈ విషయం వైరల్ అయ్యింది. సిగ్గుతో తలదించుకున్న పోలీస్ శాఖ, బాధ్యులైన పోలీసుల్ని సస్పెండ్ చేసింది. కార్తీక్ పత్రీకి క్షమాపణలతోపాటు, కృతజ్ఞతలూ తెలిపింది.
I would like to share a traumatic incident my wife and I encountered the night before. It was around 12:30 midnight. My wife and I were walking back home after attending a friend’s cake-cutting ceremony (We live in a society behind Manyata Tech park). (1/15)
— Karthik Patri (@Karthik_Patri) December 9, 2022