ఐపీఎల్ పెట్టిన చిచ్చు.. ఏకంగా టీవీ కొనిచ్చిన వంటలక్క

Advertisement

కార్తీక దీపం ఈ సీరియల్ పేరు వినని వారంటూ ఎవరు ఉండరు. తెలుగు రాష్ట్రాల్లో రాత్రి 7: 30 అయ్యిందంటే ప్రేక్షకులు అందరు టీవీకి అతుక్కుపోయి ఈ సీరియల్ చూస్తుంటారు. ఎందుకంటే ఆ సీరియల్ కు ఉన్న క్రేజె వేరు. ఒకవైపు ఎన్ని సీరియల్స్ వచ్చిన ఆ సీరియల్ ను మాత్రం ఢీ కొట్టలేకపోతున్నాయి. ఇక ఈ కార్తీక దీపం సీరియల్ కు రేటింగ్ టాప్ లో ఉంటుంది. ఇది ఇలా ఉంటె ఈరోజు నుండి ఐపీఎల్ ప్రారంభం కానుంది. అయితే ఇక్కడ సమస్య ఏంటేంటే కార్తీకదీపం ప్రసారమయ్యే రాత్రి 7:30 సమయంలో ఐపీఎల్ మ్యాచ్లు ప్రసారమవుతున్నాయి.

ఇక ఇదే విషయంపై ఓ కార్తీక దీపం సీరియల్ వీరాభిమాని ఏకంగా ఐపీఎల్ టైమింగ్స్ మార్చాలని ట్విట్టర్ వేదికగా గంగూలీ, స్టార్ మా ను ట్యాగ్ చేశాడు. ఇక ఈ పోస్టుపై స్టార్ మా కూడా స్పందిస్తూ.. న్యాయపరమైన కోరిక అంటూ రి ట్వీట్ చేసారు. ఇక ఈ విషయం తెలుసుకున్నా కార్తీక దీపంలో నటిస్తున్న దీప(వంటలక్క) తన సీరియల్ వీరాభిమానికి సంతోషం వ్యక్తం చేసి 32 అంగుళ టీవీని గిఫ్టుగా ఇచ్చింది వంటలక్క. దీనితో ఆ కార్తీక దీపం అభిమాని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here