Cricketer : వన్డేల్లో ఒకే ఒక్కడు 407 పరుగులు.. వరల్డ్ రికార్డ్‌ దక్కించుకున్న మన కుర్రాడు

NQ Staff - November 14, 2022 / 10:40 AM IST

Cricketer : వన్డేల్లో ఒకే ఒక్కడు 407 పరుగులు.. వరల్డ్ రికార్డ్‌ దక్కించుకున్న మన కుర్రాడు

Cricketer : ఒకప్పుడు క్రికెట్లో సెంచరీ కొట్టడం అంటే చాలా గొప్ప విషయం.. కానీ వన్డేల్లో డబల్ సెంచరీ సాధించి మొదటి సారి క్రికెట్ అభిమానులను సచిన్ టెండూల్కర్ ఆశ్చర్య పరిచిన విషయం తెలిసిందే.

ఇక టీ20 లో సెంచరీ కొట్టడం అంటే అసాధ్యం అని చాలా మంది భావించారు, కానీ సునాయాసంగా టీ20 లో కూడా సెంచరీలు కొట్టేస్తున్న క్రికెటర్స్ ఇప్పుడు మన దేశంతో పాటు ఇతర దేశాల్లో చాలా మంది ఉన్నారు.

టెస్టుల్లో 400 పరుగులు సాధించిన లారా రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరకుండా అలాగే ఉంది. ఇలా ఎన్నో రికార్డులు క్రికెట్ చరిత్ర లో నమోదు అవుతూనే ఉన్నాయి. తాజాగా వన్డేల్లో ఏకంగా 407 పరుగులు చేసి అద్భుతమైన వరల్డ్‌ రికార్డు ను తన సొంతం చేసుకున్నాడు కర్ణాటకకు చెందిన మంజునాథ్.

నవంబర్ 13వ తారీఖున అండర్ 16 పోటీల్లో భాగంగా సాగర్ క్రికెట్ క్లబ్ తరఫున కర్ణాటకలో జరిగిన అంతర్ జిల్లా పోటీల్లో ఆడిన మంజునాథ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.

165 బాల్‌ ఆడిన మంజునాథ్ 48 ఫోర్లు, 24 సిక్స్‌ లతో చెలరేగి 407 పరుగులను చేసి చరిత్ర సృష్టించాడు. ఈ కర్ణాటక యువ సంచలనం భవిష్యత్తులో టీమ్ ఇండియా కు ఆడతాడని అంతా నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

ఇతడొక పరుగుల యంత్రంగా మారబోతున్నాడని.. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తర్వాత ఒక అద్భుతమైన ఆటగాడిగా బ్యాట్స్మెన్ గా మంజునాథ్ నిలవబోతున్నాడని క్రీడా పండితులు మాట్లాడుకుంటున్నారు.

Read Today's Latest Sports in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us