కర్ణాటక మూవీ ఇండస్ట్రీలో డ్రగ్స్ కలకలం, సోదాలు చేస్తున్న అధికారులు

Advertisement

బాలీవుడ్ లో మొదలైన డ్రగ్స్ రచ్చ ఇప్పుడు శాండల్ వుడ్ ఇండస్ట్రీ వరకు పాకింది. ఇప్పటికే కర్ణాటక చిత్ర ప్పరిశ్రమలో ఉన్న పలువురు నటులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే, తాజాగా సినీనటి రాగిణి ద్వివేది ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. ఉదయం 6గంటల సమయంలో బెంగళూరులోని ఆమె నివాసానికి వెళ్లిన సీసీబీ అధికారుల బృందం దాదాపు నాలుగు గంటల పాటు సోదాలు జరిపినట్టు తెలుస్తోంది. ఆ సమయంలో ఆమె మొబైల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర వస్తువులను సీజ్‌ చేశారు. ఆ సమయంలో వారితో ఆమె వాదనకు దిగినట్టు సమాచారం.

డ్రగ్స్ కేసులో రాగిణీ పెరు బయటకు రావడంతోనే ఆమెకు అధికారులు నోటీసులు జారీ గురువారం విచారణకు హాజరు కావాలని తెలిపారు. అయితే ఆమె స్సోమవారం వరకు తనకు సమయం ఇవ్వాలని తన లాయర్లను పంపారు. అయితే శుక్రవారం విచారణకు హాజరు కావాలని అధికారులు చెప్పడంతో ఇవ్వాళ అధికారులు సోదాలు నిర్వహించిన తరువాత తన లాయర్లతో విచారణకు హాజరు కానున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here