Kareena Kapoor : మేము లేకపోతే మీకు ఆ మూడ్ ఎక్కడి నుంచి వస్తుంది.. కరీనా కపూర్ ఘాటు కామెంట్లు..!
NQ Staff - January 24, 2023 / 11:38 AM IST

Kareena Kapoor : ఈ నడుమ సోషల్ మీడియా వచ్చాక సెలబ్రిటీలపై దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. చాలామంది. కొందరు అయితే వారు ఎక్కడ దొరుకు తారా అని వెయిట్ చేసి మరీ ట్రోల్స్ చేస్తున్నారు. ఇలాంటి ట్రోల్స్‌ను, నెగెటివ్ కామెంట్లను కొందరు సీరియస్ గా తీసుకుంటే.. మరి కొందరు మాత్రం లైట్ తీసుకుంటూ మూవ్ ఆన్ అయిపోతున్నారు. కాగా ఈ నడుమ కొత్తగా ఓ ట్రెడ్ పుట్టుకుని వచ్చింది.
అదేంటంటే బాయ్ కాట్.. ముఖ్యంగా బాలీవుడ్ లోనే ఇలాంటి ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తోంది. బాయ్ కాట్ ట్రెండ్ వచ్చిన తర్వాత ఏ కొత్త సినిమా వచ్చినా సరే దానిపై ఇలాంటి ఇంపాక్ట్ కనిపిస్తోంది. దాంతో చాలా సినిమాలకు నష్టం జరుగుతోంది. ఇప్పుడు షారుఖ్ నుంచి వస్తున్న పఠాన్ మూవీపై కూడా బాయ్ కాట్ ట్రెండ్ నడుస్తోంది.
మా ఉద్దేశం అదే..
కాగా తాజాగా ఈ ట్రెండ్ మీద ఘాటుగా స్పందించింది కరీనా కపూర్. ఆమె మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీ అంటేనే జనాలను ఎంటర్ టైన్ చేయడం. అంతే గానీ ఎవరినీ ఇబ్బంది పెట్టే పరిశ్రమ కాదు. అసలు మేం లేకపోతే మీకు ఎంటర్ టైన్ మెంట్ మూడ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటూ ఘాటు కామెంట్లు చేసింది.
కొన్ని సినిమాలపై మాత్రమే ఈ బాయ్ కాట్ ట్రెండ్‌ను వైరల్ చేస్తున్నారు. మరి వారి పేర్లు ఎందుకు బయటకు రావట్లేదు. ఇది కొందరు కావాలని చేస్తున్న కుట్ర లాగా కనిపిస్తోంది అంటూ కామెంట్లు చేసింది కరీనా కపూర్. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.