దేవి నాగవల్లికి షాక్ ఇచ్చిన కరాటే కళ్యాణి

Advertisement

బిగ్ బాస్ రోజు రోజుకు ఆసక్తికారాన్ని పెంచుతుంది. అయితే మొదటి వారంలో సూర్య కిరణ్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఇక రెండో వారం బిగ్ బాస్ హౌజ్ నుంచి కరాటే కళ్యాణి ఎలిమినేట్ అయింది. అయితే కరాటే కళ్యాణిని నాగార్జున వేదిక పైకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమెకు ఓ టాస్క్‌ ఇచ్చారు. ఒక బోర్డు పై టాప్‌-5, బాటమ్‌-5 బ్లాక్‌లను ఇచ్చి.. కంటెస్టెంట్‌ల ఫొటోలన్నీ కూడా టేబుల్‌ పై పెట్టారు. ఇక ఆ కంటెస్టెంట్ల ఫొటోలను వాటిలో అమర్చాలని, అలాగే కారణం కూడా చెప్పాలని నాగ్ కళ్యాణికి సూచించారు. దీంతో బాటమ్‌ 5లో సోహైల్‌, సుజాత, అరియానా గ్లోరీ, కుమార్ సాయి, గంగవ్వ ఫొటోలను కళ్యాణి పెడుతుంది. తరువాత కారణాలను కూడా చెప్తుంది.

అయితే ఈ ఐదుగురు హౌజ్‌లో నిన్న నిన్ను జీరో అన్న వాళ్లేనని నాగార్జున ఓ పంచ్ వేశారు. అలాగే ఇక టాప్‌ 5లో దేత్తడి హారిక, అమ్మ రాజశేఖర్‌, మోనాల్‌, దివి, అభిజిత్‌ ఫొటోలను కళ్యాణి పెట్టారు. ఇక మొత్తానికి వెళ్తూ వెళ్తూ దేవి నాగవల్లికి పెద్ద షాక్ ఇచ్చింది. నాగార్జున ఇచ్చిన బిగ్‌బాంబ్‌ని దేవీ నాగవల్లి పై వేశారు. అంటే మూడో వారం ఎలిమినేషన్ లో దేవి నాగవల్లిని చేర్చుతూ బిగ్ బాంబ్ వేసింది కళ్యాణి. ఇక మొత్తానికి కొన్ని డైలాగులు చెప్పి కాస్తంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చి కరాటే కళ్యాణి వీడ్కోలు చెప్పింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here