Karate Kalyani: బీజేపీ తీర్ధం పుచ్చుకున్న కరాటే క‌ళ్యాణి.. కండువా క‌ప్పి స్వాగ‌తించిన విజ‌య‌శాంతి

Karate Kalyani: ఇటీవ‌లి కాలంలో సినిమా సెల‌బ్రిటీలు రాజ‌కీయాల వైపు మ‌క్కువ ఎక్కువ చూపిస్తున్నారు.ఒక‌వైపు సినిమాలు చేసుకుంటూనే మ‌రోవైపు పాలిటిక్స్‌పై దృష్టి సారిస్తున్నారు.తాజాగా క‌రాటే క‌ళ్యాణి కూడా రాజ‌కీయాల‌లోకి ఎంట్రీ ఇచ్చారు. టాలీవుడ్ ఫైర్ బ్రాండ్‌గా ఉండే క‌ళ్యాణి ఇప్పుడు బీజేపీలోకి ఎంట్రీ ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఇటీవ‌ల క‌రాటే క‌ళ్యాణి పేరు ఎక్కువ‌గా హెడ్ లైన్స్‌లో నిలిచింది. ఆమె శ్రీరెడ్డిని ఏకి పారేస్తూ మాట్లాడ‌డంతో పాటు ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింది. అలానే మా ఇష్యూస్‌లోను త‌న వాయిస్ వినిపించింది. ఈ క్ర‌మంలో కరాటే క‌ళ్యాణికి సంబంధించిన వార్త‌లు ఇటీవ‌ల బాగా హ‌ల్ చ‌ల్ చేశాయి.


ఇప్పుడు క‌ళ్యాణి .. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో పార్టీలో చేర‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. జల్ పల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్ సహా పలువురు జైన్ కమ్యూనిటీ నేతలు పెద్ద ఎత్తున బీజేపీలో చేరారు. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, మాజీ ఎంపీ విజయశాంతి సమక్షంలో కరాటే కళ్యాణి సహా పలువురు నాయకులు పార్టీ కండువా కప్పుకున్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయశాంతి మాట్లాడుతూ ఎందరో త్యాగాలతో దేశాన్ని దక్కించుకోగలిగామంటూ…. అమరవీరుల త్యాగాలకు సెల్యూట్ చెప్పారు. కానీ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం మాత్రం రాక్షసుల చేతుల్లోకి వెళ్లిందని విమర్శించారు. నిజంగా బీజేపీ మాత్రమే రాష్ట్రంలో సరైన పార్టీ అని అన్నారు. తెలంగాణ బీజేపీ చేతుల్లోకి వెళితేనే అభివృద్ధి సాధ్యమన్నారు. మోదీ, అమిత్ షా, నడ్డాసహా ఎందరో సమర్ధులున్నారని తెలిపారు. రాష్ట్రానికి సంజయ్ వంటి సమర్ధులున్నారని, ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందో స్వయంగా తెలుసుకునేందుకు సంజయ్ పాదయాత్ర చేపట్టడం చాలా సంతోషంగా ఉందని అన్నారు విజ‌య‌శాంతి.

ఇక కరాటే కళ్యాణి విష‌యానికి వ‌స్తే ఆమె చాలా సినిమాల‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌‌‌‌‌గా న‌టించింది. ఇటీవలే రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకున్నారు. ఇక కరాటే కళ్యాణి ముక్కుసూటి మనిషి, ఆమె విష‌యాన్ని స్ట్రైట్ ఫార్వ‌ర్డ్‌గా మాట్లాడుతూ అంద‌రికి వ‌ణుకు పుట్టిస్తుంది.