KAPIL: వీల్ చైర్‌లో క‌నిపించిన పాపుల‌ర్ క‌మెడీయ‌న్.. త్వర‌గా కోలుకోవాలంటూ ట్వీట్ల వ‌ర్షం

బాలీవుడ్ స్టార్ క‌మెడీయ‌న్ క‌పిల్ శ‌ర్మ కామెడీ నైట్స్ విత్ క‌పిల్ కార్య‌క్ర‌మంతో ఎంత పాపుల‌ర్ అయ్యారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. క‌మెడీయ‌న్‌గానే కాదు నిర్మాత‌గాను ఆయ‌న రాణిస్తున్నాడు. సన్‌ ఆఫ్‌ మంజీత్‌ సింగ్‌’ అనే సినిమాతో నిర్మాత‌గా మారిన క‌పిల్ శ‌ర్మ ప్ర‌స్తుతం వైవిధ్య‌మైన సినిమాలు చేసేందుకు క‌స‌ర‌త్తులు చేస్తున్నాడు. 2018లో గిన్ని చ‌రాత్‌ను హిందు, సిక్కు సంప్ర‌దాయం ప్ర‌కారం వివాహం చేసుకున్న క‌పిల్ శ‌ర్మ 2019లో అనైరా శ‌ర్మ‌కు జ‌న్మ‌నిచ్చారు. ఇక ఫిబ్ర‌వ‌రి 1,2021న కుమారుడికి జ‌న్మ‌నిచ్చారు. దేవుడి ద‌య వ‌ల‌న మాకు మ‌గ‌బిడ్డ జ‌న్మించింది. అంద‌రి ప్రార్ధ‌న‌ల వ‌ల‌న త‌ల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు అని పేర్కొన్నాడు.

క‌పిల్ శ‌ర్మ ప్ర‌స్తుతం ప‌లు షోస్‌తో అల‌రిస్తుండ‌గా, కామెడీ నైట్స్ విత్ కపిల్ అనే కార్య‌క్ర‌మం ఆయ‌న‌కు మంచి పేరు తెచ్చింది. ప‌లువురు సెల‌బ్రిటీల‌ను త‌న షోకు ఆహ్వానించి ఫుల్ కామెడీ చేస్తాడు. స‌ల్మాన్, షారూఖ్, అమీర్, హృతిక్ వంటి స్టార్ సెల‌బ్రిటీలు సైతం ఈ షోకు గెస్ట్‌లుగా హాజ‌రై అల‌రించారు. అయితే క‌పిల్ శ‌ర్మ ప‌లు వివాదాల‌తోను వార్త‌ల‌లోకి ఎక్కారు. అయితే తాజాగా ఆయ‌న ముంబై ఎయిర్ పోర్ట్‌లో వీల్‌చైర్‌లో కూర్చొని వెళుతుండ‌గా ఫొటోగ్రాఫ‌ర్స్ క్లిక్ మ‌నిపించారు. ఈ ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవ‌తుండ‌గా, అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు.

బాలీవుడ్ ప్ర‌ముఖ ఫొటోగ్రాఫ‌ర్ వైర‌ల్ భ‌యాని త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో క‌పిల్ శ‌ర్మ ఫొటోని షేర్ చేస్తూ.. ఏం జ‌రిగిందో పూర్తి క్లారిటీ లేదు, కాని వీల్ చైర్‌లో క‌పిల్ శ‌ర్మ క‌నిపించాడు. ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరుకుంటున్నాను అని పేర్కొన్నాడు. అయితే కొంత‌మంది నెటిజ‌న్స్ మాత్రం ఫ్లామిలీ ప్లానింగ్ ఆప‌రేష‌న్ చేయించుకొని ఉంటాడ‌నే సందేహం వ్య‌క్తం చేస్తున్నారు.ఒక షోకు అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న వ్యక్తిగా కూడా క‌పిల్ శ‌ర్మ స‌రికొత్త రికార్డ్ సృష్టించిన విష‌యం తెలిసిందే.

Advertisement