Kannada Actor Manjunath : వ్యభిచార గృహం నిర్వహిస్తున్న ప్రముఖ నటుడు.. అరెస్ట్ చేసిన పోలీసులు..!
NQ Staff - January 18, 2023 / 01:11 PM IST

Kannada Actor Manjunath : సినిమా ఇండస్ట్రీలో ఎదగాలని చాలామంది కలలు కంటారు. ఇక్కడ స్టార్లుగా స్థిరపడాలని ఎంతో మంది ఆశిస్తారు. కానీ అది అందరికీ సాధ్యం అయ్యే పని కాదు. కొందరికి మాత్రమే స్టార్ ఇమేజ్ దక్కుతుంది. అయితే ఇండస్ట్రీలో ఎదగలేకపోయిన కొందరు అక్రమ మార్గాలు ఎంచుకుంటారు. ఇలాంటి వారు కొన్ని సార్లు అడ్డదార్లు తొక్కుతుంటారు. చివరకు కటకటాల పాలు అవుతంటారు.
ఇప్పుడు ఓ కన్నడ నటుడు చేసిన పని కూడా ఇలాగే ఉంది. కన్నడలో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు మంజునాథ్ అలియాస్ సంజు. ఈయన ఇప్పటికే చాలా సినిమాల్లో నటించాడు. అయితే ఆయనకు సినిమాల్లో పెద్దగా స్టార్ ఇమేజ్ రాలేదు. ఈ క్రమంలోనే ఆయన ఓ వ్యభిచార గృహాన్ని నిర్వహించడం స్టార్ట్ చేశాడు.
పక్కా సమాచారంతో అటాక్..
ఆయన ఓ యాప్ సాయంతో విటులను ఆ వ్యభిచార గృహానికి వెళ్లే విధంగా చేసేవాడు. సినీ ఇండస్ట్రీలో తనకున్న పరిచయాలతో ఈ యాప్‌ను నడుపుతున్నాడు సదరు నిందితుడు. అయితే ఈ విషయం కాస్తా ఆ నోటా ఈ నోటా పాకి పోలీసులకు తెలిసింది. వారు పక్కా సమాచారంతో ఆ వ్యభిచార గృహం మీద దాడి చేశారు.
మంజునాథ్‌ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ న్యూస్ ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఆయన గతేడాది వచ్చిన ‘న్యూరాన్’ మూవీలో నటించాడు. ఇప్పుడు ఆయనపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.