సుశాంత్ ఇంట్లో జరిగిన పార్టీకి సీఎం కొడుకు వచ్చాడు: కంగనా

Advertisement

హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకోలేదని, అతనిది హత్యని మొదటి నుండి వ్యాఖ్యానిస్తున్న నటి కంగనా రనౌత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. సుశాంత్ చనిపోవడానికి ముందు రోజు జరిగిన పార్టీకి ఒక ముఖ్యమంత్రి కొడుకు వచ్చాడని, అతన్ని బేబీ పెంగ్విన్ అని పిలుస్తారని ట్విట్టర్ ద్వారా తెలిపింది.
ఆరోజు పార్టీకి వచ్చిన వ్యక్తి యొక్క పేరు అందరికి తెలిసినా కూడా చెప్పడం లేదని, కరణ్ జోహార్ కు ప్రాణ మిత్రుడైన ముఖ్యమంత్రి కొడుకే ఆ పార్టీకి వచ్చాడని వెల్లడించింది. ఒకవేళ నేను నా ఇంట్లో ఉరేసుకుని కనిపిస్తే దయచేసి అది ఆత్మహత్యని అనుకోవద్దని పేర్కొంది.

సుశాంత్ మరణంపై రోజుకో వార్త బయటకు వస్తుంది. సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రీయాపై సుశాంత్ తండ్రి కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. సుశాంత్ కు న్యాయం జరగాలని ట్విట్టర్ లో రోజు ట్రెండ్ అవుతూనే ఉంది. సుశాంత్ కేసుపై ముంబై పోలీసులు, పాట్నా పోలీసులు విచారణ జరుపుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here