కంగనా రనౌత్ ఆఫీస్ ను కూల్చేస్తున్న ముంబై అధికారులు

Advertisement

సుశాంగ్ సింగ్ రాజ్ పుత్ మరణం తరువాత బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వార్తల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు. సుశాంత్ మృతికి బాలీవుడ్ లోని బడా నిర్మాతలే కారణమని, సుశాంత్ ది ఆత్మహత్య కాదని,సుశాంత్ ది హత్య అంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అలాగే డ్రగ్స్ విషయంలో కూడా కంగనా మహారాష్ట్ర ప్రభుత్వం పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అయితే ఇవ్వాళ కంగనా రనౌత్ యొక్క ఆఫీస్ ను ముంబై మునిసిపల్ అధికారులు కూల్చి వేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని అధికారులు కూల్చివేస్తున్నారు. దీని పై కంగనా రనౌత్ స్పందిస్తూ… మహారాష్ట్ర ప్రభుత్వం బాబర్ లా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. ముంబైను పాకిస్థాన్ తో పోలుస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. ముంబైని పాకిస్థాన్ తో పోల్చడం వల్ల కంగనాపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వంపై కంగనా చేస్తున్న వ్యాఖ్యలపై ముంబై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here