కంగనాకు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న శివసేన నాయకులు

Advertisement

ముంబైని పాకిస్థాన్ తో పోలుస్తూ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అయితే ముంబై నుండి మనాలి వెళ్ళడానికి ముంబై ఎయిర్పోర్ట్ కు వచ్చిన కంగనాకు శివసేన నాయకుల నుండి ఎదురుదెబ్బ తగిలింది. కంగనాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ శివసేన నాయకులు ఎయిర్ పోర్ట్ దగ్గర ధర్నా చేస్తున్నారు. అలాగే అక్కడికి కంగనా మద్దతు దారులు కూడా చేరుకొని కంగనాకు మద్దతుగా వ్యాఖ్యలు చేస్తున్నారు.

ముంబై ఎయిర్ పోర్ట్ దగ్గర పరిస్థితి ఉద్రిక్తంగా మారడం వల్ల ముంబై పోలీసులు ఎయిర్ పోర్ట్ దగ్గర ప్రత్యేక బలగాన్ని ఏర్పాటు చేశారు. హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తరువాత కంగనా చేస్తున్న వ్యాఖ్యలు బాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తున్నాయి. సుశాంత్ మరణం వెనక, డ్రగ్స్ కుంభకోణం వెనక మహారాష్ట్ర ప్రభుత్వం యొక్క హస్తం ఉందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కంగనాకు ప్రాణానికి ముప్పు ఉందని భావించిన కేంద్ర ప్రభుత్వం ఆమెకు వై ప్లస్ క్యాటగిరి భద్రతను కలిపించింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here