Kangana Ranaut Sensational Allegations Against Director : ప్రైవేట్ పార్టులపై చేతులు వేసి నలిపేసేవాడు.. డైరెక్టర్ పై కంగనా షాకింగ్ కామెంట్స్..!
NQ Staff - August 4, 2023 / 11:20 AM IST

Kangana Ranaut Sensational Allegations Against Director :
బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది కంగనా. ముఖ్యంగా బాలీవుడ్ హీరోలు, డైరెక్టర్ల మీద ఆమె చేసే కామెంట్లు అనుబాంబులా పేలుతుంటాయి. ఇప్పటికే సల్మాన్ ఖాన్, రణ్ బీర్ కపూర్, షారుఖ్ లాంటి స్టార్ హీరోల మీద ఆమె సంచలన ఆరోపణలు చేసింది. ఇప్పుడు తాజాగా మరో డైరెక్టర్ మీద కూడా ఇలాంటి కామెంట్లే చేసింది.
అతను ఎవరో కాదు ఆమెను బాలీవుడ్ క్వీన్ ను చేసిన వికాస్ బెహెల్. గతంలో ఫాంటమ్ ఫిల్మ్ సంస్థకు చెందిన ఓ యువతి సదరు దర్వకుడిపై సంచలన ఆరోపణలు చేసింది. తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆమె ఇలాంటి ఆరోపణలు చేసింది. కాగా ఆమెకు కంగనా కూడా మద్దతు తెలిపింది.
హగ్ చేసుకున్నట్టు నటిస్తూ..

Kangana Ranaut Sensational Allegations Against Director
నేను కూడా ఆ దర్శకుడితో ఇబ్బందులు ఎదుర్కున్నాను. క్వీన్ సినిమా చేస్తున్నప్పుడు ఆ దర్శకుడు నన్ను చాలా వేధించాడు. హగ్ చేసుకున్నట్టు నటిస్తూ నా ప్రైవేట్ పార్టులపై చేతులు వేసి నలిపేసేవాడు. అది ఎవరికీ తెలియకపోవడంతో అతని నుంచి తప్పించుకునేందుకు నేను చాలా ప్రయత్నించాను అని కంగనా చెప్పుకొచ్చింది.
వికాస్ కు అప్పటికే పెళ్లి అయింది. అయినా సరే ఇతర స్త్రీలతో ఆయన అక్రమ సంబంధాలు పెట్టుకునేవాడు. నాతో కూడా రిలేషన్ పెట్టుకోవాలని చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ నేను ఒప్పుకోకపోవడంతో నాతో సినిమాలు తీయనని చెప్పాడు. అయినా సరే నేను అతనికి మాత్రం లొంగలేదు అంటూ తెలిపింది ఈ బ్యూటీ.