నేను కూడా డ్రగ్స్ కు బానిసయ్యా: కంగనా రనౌత్

Advertisement

బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తీవ్ర సంచనలం రేపుతోంది. సుశాంత్ సింగ్ మృతి పై సీబీఐ విచారణ జరుగుతున్న నేపథ్యంలో డ్రగ్స్ కోణం బయట పడింది. అధికారులు డ్రగ్స్ కు సంబంధించిన కోణంలో విచారిస్తూ ఇప్పటికే రియా చక్రవర్తిని, సోదరుడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అలాగే రకుల్ ప్రీతి సింగ్, సారా అలీ ఖాన్ పేర్లు కూడా ఈ వ్యవహారంలో బయటపడ్డాయి. అయితే డ్రగ్స్ విషయంలో మొదటి నుండి నటి కంగనా రనౌత్ ఘాటు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు నటి కంగనాకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఏడాది మార్చి నెల‌లో ఇంటి వ‌ద్ద ఉన్న కంగ‌నా ఓ వీడియోలో మాట్లాడుతూ ‘‘నటి కావాలనే ఉద్దేశంతో నేను చిన్న‌ప్పుడే ఇల్లు వ‌దిలి ముంబై వ‌చ్చేశాను. కొన్ని సంవ‌త్స‌రాల‌కు ముంబైలో సినీ న‌టిగా మారాను. ఈ క్ర‌మంలో నేను ఇబ్బందులు ప‌డ్డాను. ఎంతో మంది చెడ్డ‌వారిని ఫేస్ చేశాను. డ్ర‌గ్స్‌కు కూడా బానిస‌య్యాను. ఇలా నా జీవింతో ఎన్నో జ‌రిగాయని వెల్లడించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బాలీవుడ్ లో డ్రగ్స్ వాడుతున్న వారి గురించి తనకు తెలుసని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ వీడియో బయటకు రావడంతో కంగనా కూడా డ్రగ్స్ వాడేదా అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here