కరోన వ్యాక్సిన్ పై ట్రంప్ వ్యాఖ్యలను నమ్మలేం: కమలా హరీస్

Advertisement

కరోనా వ్యాక్సిన్ కోసం కరోనా భాదితుల కంటే కూడా అమెరికా రాజకీయ నాయకులు ఎక్కువగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కరోనా వ్యాక్సిన్ పై అక్కడి నాయకులు రాజకీయం చేస్తున్నారు. ఇప్పటికే నవంబర్ 1 నుండి దేశములో వ్యాక్సిన్ ను పంపిణీ చేస్తామని, దీనికోసం రాష్ట్రాల గవర్నర్ లు సిద్ధంగా ఉండాలని ట్రంప్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై డెమోక్రాటిక్‌ పార్టీ తరఫున ఉపాధ్యక్ష బరిలో ఉన్న కమలా హారిస్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

వ్యాక్సిన్ విషయంలో ట్రంప్ చెప్తున్న మాటలపై తనకు నమ్మకం లేదని, కేవలం ప్రచారం కోసం మాత్రమే ట్రంప్ ఇలా మాట్లాడుతున్నారని వెల్లడించారు. తనపై వస్తున్న ఆరోపణలను తొలగించుకోవడానికి ప్రజలకు నాణ్యత లేని, భద్రత లేని వ్యాక్సిన్ ఇవ్వడం తగదని చెప్పారు. 2021 వరకు వ్యాక్సిన్ వచ్చే అవకాశమే లేదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజెషన్ చెప్పిన విషయం తెలిసిందే. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు నిజమో కాదో తెలియాలంటే నవంబర్ 1 వరకు వేచి చూడాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here