అసలు ఆ జబ్బుకు వ్యాక్సిన్ లేదు : కమలా హారిస్
Admin - August 20, 2020 / 12:03 PM IST

అమెరికాలో జరగవలిసిన ఎలక్షన్ల కోసం అభ్యర్థులు హోరా హోరిన ప్రచారం చేస్తున్నారు. అయితే ప్రస్తుత అమెరికా అధ్యక్షడు రోనాల్డ్ ట్రంప్ కూడా బరిలో ఉన్నాడు. అలాగే డెమొక్రాటిక్ పార్టీ తరఫున అమెరికా ఉపాధ్యక్ష పదవికి కమలా హారిస్ పోటీపడుతున్నారు. అయితే కమలా హారిస్ ఇవాళ అమెరికాలో అమరులైన పలు ఆఫ్రికన్ అమెరికన్లను గుర్తుచేసుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. జాతి అహంకారానికి మందులేదు అని అన్నారు. అలాగే డెమొక్రాట్లకు అధికారమిస్తే చట్టం ప్రకారం అందరికీ సమన్యాయం జరిగేలా పని చేస్తామన్నారు.
జాతి అహంకారానికి వ్యాక్సిన్ అనేది లేదు. దీనిపై మనం అందరం పోరాడాల్సిన సమయం ఏర్పడింది. అలాగే జార్జ్ ఫ్లాయిడ్ కోసం, బ్రియానా టేలర్ కోసం, ఇంకా మన కోసం, మన పిల్లల కోసం చనిపోయిన అనేకమంది అమరుల కోసం మనం ఏకదాటి మీద నిలబడాలి అని అన్నారు. డెమొక్రాటిక్ పార్టీ అధికారంలోకి వస్తే చట్టం ప్రకారం అందరికీ సమన్యాయం జరిగేలా పనిచేస్తామని అన్నారు.