Kamal haasan: గుడ్ న్యూస్.. క‌రోనా నుండి కోలుకున్న క‌మ‌ల్ హాస‌న్

NQ Staff - December 1, 2021 / 06:39 PM IST

Kamal haasan: గుడ్ న్యూస్.. క‌రోనా నుండి కోలుకున్న క‌మ‌ల్ హాస‌న్

Kamal haasan: గ‌త వారం రోజులుగా సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎన్ని విషాదాలు చోటు చేసుకున్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. సెల‌బ్రిటీల వ‌రుస మ‌ర‌ణాల‌తో సినీ ప్రేక్ష‌కులు ఆందోళ‌న చెందారు. అయితే ఇప్పుడు అభిమానులు కాస్త ఉప‌శ‌మ‌నం పొందే వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. కమల్ ప్రస్తుతం కోవిడ్ నుంచి పూర్తి కోలుకున్నారని.. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

kamal haasan recove from corona

kamal haasan recove from corona

తాజాగా ఆయన ఆరోగ్య పరసిత్థిపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఇటీవల అమెరికా నుంచి తిరిగొచ్చిన తర్వాత కమల్ స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. దీంతో పరీక్షలు చేయించుకోగా.. కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని కమల్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. వైద్యుల సమక్షంలో వారి సూచనలు.. చికిత్స తీసుకుంటూ క్యారంటైన్లో ఉన్నట్లు కమల్ తెలిపారు.

ఇక కమల్ హాసన్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన కూతురు శ్రుతి హాసన్ ఎప్పటికప్పుడు తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేస్తూ వచ్చారు. ఇక తాజాగా విడుదలైన కమల్ హెల్త్ బులెటిన్‏లో ఆయన పూర్తిగా కరోనా నుంచి కోలుకున్నట్లుగా తెలిపారు. డిసెంబర్ 3న అతడిని డిశార్జ్ చేయనున్నామని.. డిసెంబర్ 4 నుంచి కమల్ తన పనులు చేసుకోవచ్చని తెలిపారు.

విల‌క్ష‌ణ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ క‌థానాయ‌కుడిగా ఖైది, మాస్ట‌ర్ చిత్రాల ద‌ర్శ‌కుడు లోకేశ్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘విక్ర‌మ్‌’. విల‌క్ష‌ణ పాత్ర‌ల‌తో, సినిమాల‌తో ఐదు ద‌శాబ్దాల‌కు పైగా సినీ జ‌గ‌త్తులో త‌న‌దైన ప్ర‌స్థానాన్ని స్థాపించిన క‌మ‌ల్ హాస‌న్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

kamal haasan recove from corona1

kamal haasan recove from corona1

న‌టుడు, నిర్మాత‌, ద‌ర్శ‌కుడు, రైట‌ర్ ఇలా సినీ ఇండ‌స్ట్రీలోని అన్ని విభాగాల‌పై మంచి అవ‌గాహ‌న ఉన్న అతి కొద్ది మందిలో క‌మ‌ల్ హాస‌న్ ఒక‌రు. అయితే ఈ మ‌ధ్య కాలంలో ఆయ‌న రాజ‌కీయాల్లోకి వెళ్ల‌డం, బిగ్‌బాస్ వంటి రియాలిటీ షోస్ కార‌ణంగా సినిమాలు చేయలేదు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us