Kamal Haasan : ఆసుపత్రిలోనే కమల్ హాసన్.! ప్రాణాపాయం లేదన్న వైద్యులు.!

NQ Staff - November 24, 2022 / 08:01 PM IST

Kamal Haasan : ఆసుపత్రిలోనే కమల్ హాసన్.! ప్రాణాపాయం లేదన్న వైద్యులు.!

Kamal Haasan : ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ అనారోగ్యంతో నిన్న చెన్నయ్‌లోని ఓ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. జ్వరం రావడంతో ఆయన్ని ఆసుపత్రిలో చేర్చారు. వైద్య పరీక్షలు నిర్వహించి, సాధారణ జ్వరమేనని వైద్యులు చెప్పారనీ, రాత్రంతా అబ్జర్వేషన్‌లో వుంచి, ఉదయాన్నే డిశ్చార్జి చేశారనీ తొలుత వార్తలొచ్చాయి.

కానీ, కమల్ హాసన్ ఇంకా ఆసుపత్రిలోనే వున్నారు. జ్వరంతోపాటు, శ్వాస తీసుకోవడంలో కమల్ హాసన్ ఇబ్బంది పడుతున్నట్లు తాజాగా ఆసుపత్రి వర్గాలు మెడికల్ బులెటిన్ విడుదల చేశాయి.

నిలకడగానే ఆరోగ్య పరిస్థితి..

కమల్ హాసన్‌కి ప్రాణాపాయం ఏమీ లేదనీ, ఒకటి రెండు రోజుల్లో ఆయన్ని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేస్తామనీ, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే వుందని కమల్ హాసన్‌కి వైద్య చికిత్స అందిస్తున్న వైద్యులు వెల్లడించారు.

కాగా, కమల్ ఆరోగ్య పరిస్థితిపై తమిళనాడు ప్రభుత్వ వర్గాలు ఆరా తీశాయి. పలువురు సినీ ప్రముఖులు కమల్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.
నిన్ననే కమల్ హాసన్ హైద్రాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే.

తన సినీ గురువు కె.విశ్వనాథ్‌ని హైద్రాబాద్‌లో కలిశారు కమల్ హాసన్. హైద్రాబాద్ నుంచి చెన్నయ్ వెళ్ళిన కొద్ది గంటల్లోనే కమల్ అస్వస్థతకు గురయ్యారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us