Kamal Haasan And Mani Ratnam : కమల్, మణిరత్నం మూవీలో ఏడుగురు బడా స్టార్ల గెస్ట్ రోల్స్? షారుఖ్, మమ్ముట్టి.. ఇంట్రస్టింగ్ లిస్టే ఉందిగా.

NQ Staff - January 24, 2023 / 03:48 PM IST

Kamal Haasan And Mani Ratnam  : కమల్, మణిరత్నం మూవీలో ఏడుగురు బడా స్టార్ల గెస్ట్ రోల్స్? షారుఖ్, మమ్ముట్టి.. ఇంట్రస్టింగ్ లిస్టే ఉందిగా.

Kamal Haasan And Mani Ratnam  : విక్రమ్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్న కమల్ హాసన్ అప్ కమింగ్ ప్రాజెక్టులపై ఫుల్ ఫోకస్ పెట్టాడు. త్వరలో ఏ చిత్రంతో లోకనాయకుడు బాక్సాఫీస్ బరిలోకి దిగుతాడన్న ఎదురుచూపులకు పరదా దించుతూ మణిరత్నం డైరెక్షన్లో సినిమా అనౌన్స్ చేశాడు. 1987 లో విడుదలైన నాయకుడు తర్వాత కమల్, మణిరత్నం కాంబోలో సినిమా రాలేదు. దాదాపు 36 ఏళ్ల తర్వాత వీళ్లిద్దరూ కలిసి చేస్తోన్న ప్రాజెక్ట్ కావడం, కమల్ నటిస్తోన్న 234వ చిత్రం కావడంతో ఈ మూవీపై ఆల్రెడీ అంచనాలు ఆకాశాన్ని తాకేశాయి.

ప్యాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కమల్ తో పాటు మరికొందరు ఇండియా టాప్ స్టార్స్ తెరపై సందడి చేస్తారనే లేటెస్ట్ టాక్ తెగ చక్కర్లు కొడుతోంది. ఒక్కరు ఇద్దరు కాదు.. ఏకంగా ఏడుగురు బడా హీరోలు ఈ మూవీలో కామియో రోల్ లో కనిపించనున్నారట. ఈ లిస్ట్ లో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, మళయాళ స్టార్ మమ్ముట్టి పేర్లయితే దాదాపు కన్ఫామేనట. మరికొందరి పేర్లుకూడా జోరుగానే వినిపిస్తున్నా ఈ ఇద్దరు హీరోలు మాత్రం పక్కా అనేది లేటెస్ట్ న్యూస్.

Kamal Haasan And Mani Ratnam Coming Combo But Expectations For Movie Increased

Kamal Haasan And Mani Ratnam Coming Combo But Expectations For Movie Increased

గతంలో షారుఖ్ తో దిల్ సే, మమ్ముట్టితో దళపతి చిత్రాల్ని తెరకెక్కించాడు మణిరత్నం. ఓ వైపు ఆ రిలేషన్ తో పాటు మరోవైపు కమల్ హాసన్ మీదున్న రెస్పెక్ట్ తో స్పెషల్ రోల్స్ చేయడానికి వీళ్లిద్దరూ ఓకే అనేశారట. ప్రెస్టేజియస్ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో, ఇలా ఒక్కో భాషలో ఒక్కో స్టార్ కనిపిస్తే అన్ని లాంగ్వేజుల ఇండస్ట్రీల్లోనూ సినిమా కమర్షియల్ గా వర్కవుట్ అవడానికి కూడా చాలా స్కోప్ ఉంటుందనేది మేకర్స్ ప్లాన్ అయ్యుండొచ్చు.

ఇక మణిరత్నం డైరెక్ట్ చేసిన పొన్నియిన్ సెల్వన్ పార్ట్ వన్ రిలీజైపోయింది. పార్ట్ టూ ఏప్రిల్ 28న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. రెండు భాగాల షూటింగుని ఒకేసారి ఫినిష్ చేసేయడంతో పీఎస్ టూ కోసం ఇప్పుడంతగా సమయం కేటాయించే అవసరం లేకపోవడంతో కంప్లీట్ గా కమల్ మూవీ పైనే ఫోకస్ చేశాడట మణిరత్నం.

Kamal Haasan And Mani Ratnam Coming Combo But Expectations For Movie Increased

Kamal Haasan And Mani Ratnam Coming Combo But Expectations For Movie Increased

సినిమాలో కమల్ హాసన్ కు జోడీగా త్రిష నటిస్తుందని మూవీ టీమే అఫీషియల్ గా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. వీరిద్దరి పేర్లు తప్ప మిగతా ఏ యాక్టర్ల పేర్లు గానీ, కాస్టింగ్ డీటెయిల్స్ గానీ రివీల్ చేయలేదు. సో.. ఇప్పటివరకూ వినిపిస్తున్న ఈ యాక్టర్ల పేర్లు, కామియో రోల్స్ గురించి అధికారికంగా అప్ డేట్సయితే రాలేదు. కానీ సోషల్మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ ఏడుగురు స్టార్ల గెస్ట్ రోల్ మ్యాటర్ నిజమైతే గనక లోకనాయకుడు మూవీ బాక్సాఫీసుని ఏలేయడం గ్యారంటీ.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us