Kamal Haasan : ఆట్.. కమల్ హాసన్ యంగ్ హీరోలతో పోటీగా వరుస భారీ సినిమాలు
NQ Staff - November 7, 2022 / 11:51 AM IST

Kamal Haasan : విక్రమ్ సినిమా సక్సెస్ తర్వాత లోకనాయకుడిలో మునుపెన్నడూ లేనంత జోరు కనిపిస్తోంది. ఆ మూవీ ఇచ్చిన జోష్‌తో వరుసగా భారీ సినిమాలు చేస్తూ, ఇక కమల్ కెరీర్ అయిపోయింది అన్న వాళ్లకు షాకుల మీద షాకులిస్తున్నాడు. తన 234 వ చిత్రం మణిరత్నం డైరెక్షన్లో ఉండబోతుందని లేటెస్ట్గా అనౌన్సయింది. కమల్ హీరోగా లెజెండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన నాయకుడు ఇండియన్ హిస్టరీలో నిలిచే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా సెన్సేషన్ క్రియేట్ చేసింది.
మళ్లీ ఇన్నాళ్లకు దాదాపు 35 ఏళ్ల తర్వాత వీళ్లిద్దరు కొలాబరేట్ అవుతుండడంతో ప్రాజెక్ట్ అనౌన్స్ అయి అవడంతో మూవీ లవర్స్ తెగ సంబరపడిపోతున్నారు. మరోవైపు భారీ చిత్రాల దర్శకుడు శంకర్ డైరెక్షన్లో భారతీయుడు పార్ట్ టూ మూవీ షూట్ కూడా అడ్డకుంలొచ్చినా ఆగకుండా జరుగుతూనే ఉంది. భారతీయుడు సినిమా వచ్చిన 21 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు అదే లుక్స్ తో సీక్వెల్ వస్తుండడంతో అన్ని జనరేషన్ల ఆడియెన్స్‌లోనూ హైప్ భారీగా ఉందీ సినిమాపై.
మణిరత్నం, శంకర్ లాంటి సీనియర్ డైరెక్టర్లతోనే కాదు, యంగ్ మేకర్స్‌తోనూ సినిమాల్ని ఒప్పుకుంటున్నాడు కమల్. విక్రమ్ మూవీకి లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలోనే సీక్వెల్ రావాల్సి ఉందన్న మ్యాటర్ తెలిసిందే. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో పార్టయిన ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి ఇంకా టైమ్ ఉండడంతో మిగతా కొత్తసినిమాలకు ఓకే చెప్తున్నాడు లోకనాయకుడు.
కోలీవుడ్ డైరెక్టర్ హెచ్. వినోద్ దర్శకత్వంలో మరో కొత్త మూవీలో యాక్ట్ చేయడానికి రెడీ అయ్యాడు కమల్. అజిత్ హీరోగా వినోద్ డైరెక్ట్ చేసిన ‘తునివు’ మూవీ ఈ సంక్రాంతికి రిలీజ్ కానుంది. నేర్కొండ పార్వై (పింక్ రీమేక్), వాలిమై సినిమాల తర్వాత వీళ్లిద్దరి కాంబోలో రానున్న మూడో చిత్రమిది.
తునివు విడుదల కూడా కాకముందే కమల్ ఈ దర్శకుడితో సినిమాకి ఓకే చేశాడట.
విశ్వరూపం మూవీ టైమ్‌లో కాంట్రవర్సీలు ఫేస్ చేసి నేషన్ వైడ్ గా వార్తల్లో నిలిచినా, సినిమాల పరంగా సరైన సక్సెస్, తన రేంజ్‌కి తగ్గ హిట్ లేక ఇబ్బందిపడ్డాడు కమల్ హాసన్. ప్రయోగాత్మక ప్రాజెక్టులు చేసినా అవేవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. కొన్ని సినిమాలకయితే మినిమమ్ ఓపెనింగ్స్ కూడా రాకపోవడంతో కమల్ అభిమానులు తలెత్తుకోలేకపోయారు.

Kamal Haasan Agrees Make Films with Young Makers
మరోవైపు పార్టీ స్థాపించి పొలిటికల్‌గా ఫోకస్ పెట్టినా కూడా పెద్ద ఉపయోగం లేకపోయింది. రాజకీయంగా రాణిద్దామని చేసే ప్రయత్నాల్లో బిజీ అయి సినిమాలపై పూర్తిగా శ్రద్ధ పెట్టకపోవడం వల్ల కూడా ఆయన నుంచి అద్భుతమైన ప్రాజెక్ట్స్ ఏమీ రాలేదు. ఇక ఇదంతా కుదిరేలా లేదనీ విక్రమ్ మూవీ నుంచి సినిమాల పైనే కాంసంట్రేట్ చేయడంతో,ఆ చిత్రం కూడా విడుదలైన అన్నిభాషల్లోనూ బ్లాక్ బస్టర్ అవడంతో నేషన్ వైడ్ గా మళ్లీ తన క్రేజ్ అండ్ రేంజ్‌ను తిరిగి సంపాదించుకుని ఉలగ నాయగన్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నాడు.
ఇక ఇప్పుడు వినోద్, లోకేష్ కనగరాజ్ లాంటి యూత్ డైరెక్టర్స్ తో పాటు శంకర్, మణిరత్నం లాంటి సీనియర్ దర్శకులతోనూ వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ తెగ బిజీ అవుతూ యంగ్ హీరోలకు కూడా టఫ్ పోటీనిస్తున్నాడు. మరి వరుస సినిమాలతో, హిట్ల మీద హిట్లతో ఇంకెన్ని సెన్సేషన్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి మరి.