Kalyan Ram And Jr NTR : ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించిన తారక్, కళ్యాణ్ రామ్..!
NQ Staff - January 18, 2023 / 09:20 AM IST

Kalyan Ram And Jr NTR : సీనియర్ ఎన్టీఆర్ 27వ వర్థంతి నేడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్దకు నందమూరి కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు చేరకుకుంటున్నారు. ఆయనకు నివాళి అర్పించి ఆ మహానేతను స్మరించుకుంటున్నారు. ఈ క్రమంలోనే సీనియర్ ఎన్టీఆర్ మనవలు అయిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్దకు తెల్లవారు జామునే చేరుకున్నారు.
తాతకు నివాళి..
తమ తాతకు నివాళి అర్పించారు. తాత సమాధి వద్ద బొకేలు ఉంచారు. ఈ సందర్భంగా సీనియర్ ఎన్టీఆర్ చేసిన సేవలను వారిద్దరూ స్మరించుకున్నారు. ప్రతి ఏడూ తారక్, కల్యాణ్ రామ్ ఇద్దరూ కలిసి వచ్చి తాతకు నివాళి అర్పిస్తూ ఉంటారు. ఈ సారి కూడా అలాగే చేశారు. అయితే నందమూరి ఫ్యామిలీలో వీరిద్దరు మాత్రమే కలిసి వస్తారు.
మిగతా వారెవరూ ఎవరికి వారు గానే వస్తారు. వీరి తర్వాత బాలకృష్ణ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక సినిమాల పరంగా చూసుకుంటే తారక్ తన తర్వాత సినిమాను కొరటాల శివతో చేస్తున్నాడు. అలాగే కల్యాణ్ రామ్ ఓ సినిమాను శరవేగంగా కంప్లీట్ చేస్తున్నాడు.