Kalpika Ganesh : బాల్స్ వున్నాయా బ్రో.! నటి కల్పిక బూతు పురాణం.!

NQ Staff - November 23, 2022 / 01:27 PM IST

Kalpika Ganesh : బాల్స్ వున్నాయా బ్రో.! నటి కల్పిక బూతు పురాణం.!

Kalpika Ganesh : సోషల్ మీడియాలో బూతులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతోంది నటి కల్పిక గణేష్. మరి, ఆమె కూడా బూతులు మాట్లాడితే.! ఆమె చేస్తే అది తప్పు కాదు, ఇంకెవరైనా చేస్తే మాత్రం అది చాలా పెద్ద నేరం.

నటుడు అభినవ్ గోమటం విషయమై కల్పిక గణేష్ గత కొద్ది రోజులుగా తీవ్రాతి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. అభినవ్ గోమటం మాత్రం, కల్పిక విమర్శలపై సైలెంటుగా వున్నాడు. బహుశా అదే, ఆమె మరింత రెచ్చిపోవడానికి కారణమేమో.!

ఇద్దరి మధ్యా అసలేం జరిగింది..?

ఏమో, ఈ ఇద్దరి మధ్యా ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. ఆమె ఏదో చెబుతోంది. ఆయనైతే పెదవి విప్పడంలేదు. తాజాగా, సోషల్ మీడియాలో ‘వెక్కిరింత’ ఫొటో పోస్ట్ చేసిన కల్పిక, ‘బాల్స్ వున్నాయా బ్రో..’ అంటూ జుగుప్సాకరమైన రీతిలో ఓ స్టోరీ రాసుకొచ్చింది.. అభినవ్ గోమటం సోసల్ మీడియా హ్యాండిల్‌ని ట్యాగ్ చేస్తూ.

ఈ ‘బాల్స్’ గోలేంటి.? అభినవ్ మీద కల్పికకు అంత అసహనం దేనికి.? ఇద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకోవచ్చు.. లేదంటే, అభినవ్ వల్ల ఆమెకు నష్టం జరిగితే పోలీసుల్నీ ఆశ్రయించొచ్చు. కానీ, ఇలా సోషల్ మీడియా వేదికగా అభ్యంతకరమైన భాష ప్రయోగిస్తే ఎలా.?

బహుశా ఈ ‘బాల్స్’ మేటర్‌తో పాపులారిటీ పొందాలని కల్పిక చూస్తోందేమో.!

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us