Kajal Aggarwal : నేను ప్రెగ్నెంట్ కాదురా బాబు.. కాజల్ అగర్వాల్ క్లారిటీ..!
NQ Staff - June 19, 2023 / 10:54 AM IST

Kajal Aggarwal : టాలీవుడ్ చందమామ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని చూస్తోంది. పెళ్లికి ముందు సౌత్ ఇండియాలో అగ్ర హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. ఆమె నటించిన సినిమాలు దాదాపు హిట్టే అయ్యాయి. ఇక కెరీర్ పీక్స్ లో ఉండగానే ఆమె తన చిన్న నాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూను ప్రేమించి పెళ్లి చేసుకుంది.
ఆమెకు ఓ కొడుకు కూడా పుట్టాడు. దాంతో ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం ఆమె సత్యభామ సినిమాలో నటిస్తంది. ఇది ఆమెకు 60వ సినిమా. నిన్న ఆమె బర్త్ డే సందర్భంగా మూవీ టీజర్, గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్ లో ఆమె పాల్గొన్నారు. అయితే మొన్నటి నుంచి ఆమె మీద కొన్ని రూమర్లు వస్తున్నాయి.

Kajal Aggarwal Reacts Rumours
ఆమె మళ్లీ ప్రెగ్నెంట్ అని.. త్వరలోనే సినిమాలకు గుడ్ బై చెప్పబోతోంది అంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా వాటిపై ఆమె స్పందించింది. నేను సినిమాలకు గుడ్ బై చెప్పుబోతున్నాను అని చెప్పడంలో ఎలాంటి నిజం లేదు. అవన్నీ ఉత్త రూమర్లే. ప్రస్తుతం నా ఫోకస్ మొత్తం సినిమాలపైనే ఉంది.

Kajal Aggarwal Reacts Rumours
ఇంకో ఏడాది వరకు నా డేట్స్ ఖాళీగా లేవు అంటూ తెలిపింది. అంటే .. కాజల్ అగర్వాల్ ప్రెగ్నెంట్ కాదని ఇన్ డైరెక్టుగా చెప్పిందన్నమాట. ఇంకో ఏడాది వరకు డేట్స్ ఖాళీగా లేవని చెప్పిందంటే ఆమె ప్రెగ్నెంట్ కాదన్నమాట కదా. ఇక కమల్ హాసన్ తో కూడా ఆమె ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.