Kajal Aggarwal And Sree Leela : ఆ స్టార్ హీరో పాటకు స్టెప్పులేసిన కాజల్, శ్రీలీల.. ఊపేశారంతే..!
NQ Staff - June 21, 2023 / 09:29 AM IST

Kajal Aggarwal And Sree Leela : కాజల్, శ్రీలీల.. ఇద్దరూ ఇద్దరే. అందంలో ఎవరికి ఎవరు తీసిపోరు. కాజల్ సీనియర్ హీరోయిన్ కాగా.. శ్రీలీల యంగ్ సెన్సేషనల్. అయితే ఇద్దరినీ ఒకే ఫ్రేమ్ లో చూస్తే ఎలా ఉంటుంది. పైగా ఇద్దరూ ఒకే చోట ఒకేలా డ్రెస్ వేసుకుని డ్యాన్స్ చేస్తే అదుర్స్ కదా.. ఇప్పుడు ఇదే చేసి చూపించారు ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు.
తాజాగా వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు. అదే బాలయ్య హీరోగా వస్తున్న మూవీ భగవంత్ కేసరి. అపజయం ఎరుగని దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటి వరకు అనిల్ రావిపూడి తీసిన సినిమాలు అన్నీ బ్లాక్ బస్టరే. ఇక బాలయ్య రీసెంట్ గా నటించిన రెండు సినిమాలు కూడా పెద్ద హిట్ అయ్యాయి.
అందుకే ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో కాజల్ అగర్వాల్, శ్రీలీల కలిసి నటిస్తున్నారు. శ్రీలీల ఇందులో బాలయ్య కూతురుగా కనిపిస్తోంది. అయితే మొన్న అనిల్ రావిపూడి టీమ్ కలిసి బాలయ్య లారీ డ్రైవర్ సినిమాలోని బాలయ్య, బాలయ్య సాంగ్ కు డ్యాన్స్ చేశారు.
ఇప్పుడు తాజాగా కాజల్ అగర్వాల్, శ్రీలీల కలిసి నరసింహనాయుడు సినిమాలోని చిలకపచ్చ కోక, పెట్టినాది కేక అనే పాటకు డ్యాన్స్ చేశారు. ఈ వీడియోను అనిల్ రావిపూడి తన ఇన్ స్టాలో పోస్టు చేశారు. మేం డ్యాన్స్ చేసే బాలయ్య హీరోయిన్లకు కడుపు మండిపోయింది. అందుకే వారు కూడా బాలయ్య సాంగ్ కు చించేశారు అంటూ రాసుకొచ్చాడు.